రైతుల కోసమే కొనుగోలు కేంద్రాలు

Thu,April 18, 2019 12:00 AM

దహెగాం : రైతుల సౌకర్యం కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని జేసీ రాంబాబు అన్నారు. బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 26 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. యాసంగిలో 20,500 మెట్రిక్ టన్నుల కొనుగోల్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 1770, బీ గ్రేడ్‌కు రూ. 1750 చెల్లించనున్నట్లు తెలిపారు. రైతులు ఇక్కడే విక్రయించి మద్దతు పొందాలని సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ డీఎం గోపాల్, డీసీఏవో రబ్బాని, డీసీవో కృష్ణ, తహసీల్దార్ సదానందం, డీఎస్‌వో స్వామి కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ కిరణ్ కుమార్, ఆర్‌ఐ మోహన్, పీఎసీఎస్ కార్యదర్శి బక్కయ్య, సిబ్బంది తుమ్మిడె నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సద్వినియోగం చేసుకోవాలి..
పెంచికల్‌పేట్ : కొనుగోలు కేంద్రాలను సద్విని యోగం చేసుకోవాలని జేసీ రాంబాబు సూ చించారు. మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 1770, బీ గ్రేడ్ రూ. 1750 మద్దతు ధరను అందిస్తున్నాదన్నారు. రైతులు తేమశాతం తక్కువ ఉండేలా చూసుకోవాలన్నారు. విక్రయించిన 15 రోజుల్లోగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. రైతులకు సౌకర్యాలు కల్పించాలని జిల్లా సహకార అధికారి మహాబూద్‌కు సూచించారు. కార్యక్రమంలో డీసీఎస్‌వో స్వామికుమార్ డీఎం గోపాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ శ్యాంలాల్, ఆర్‌ఐ సంతోష్, సహకార జూనియర్ అసిస్టెంట్ సంజీవ్ కుమార్, వీఆర్వో వైకుంఠం రైతులు ఉన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles