పల్లెల్లో పరిషత్ సందడి

Wed,April 17, 2019 12:32 AM

-ఊరూరా వేడెక్కిన స్థానిక రాజకీయం
-ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు
-టికెట్ల కోసం ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మూడు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎ న్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షె డ్యూల్ విడదల చేయడంతో పల్లెలలో మరోసారి వా తావరణం వేడెక్కింది. ఇప్పటికే జిల్లాలోని 15 మం డలాల్లోని ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లతో పాటు 123 ఎంపీటీసీల స్థానాలకు జనాభా దామాశ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆశావహులు టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా పార్టీల నుంచి మండల, గ్రామ స్థా యి కార్యకర్తలు, నాయకులు టికెట్ల కోసం పోటీ ప డుతున్నారు. తమ తమ గ్రామాల్లో వచ్చిన రిజర్వేషన్లకు అనుగుణంగా టికెట్లను ఆశిస్తున్నారు. పార్టీ గుర్తులపై జరిగే ప్రాదేశిక ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలోనే రిజర్వేషన్లు ఖరారు..
జిల్లాలోని 15 జడ్పీటీసీ, 15 ఎంపీపీ స్థానాలతో పాటు 123 ఎంపీటీసీ స్థానాలకు అధికారులు గతంలోనే రిజర్వేషన్లు ఖరారు చేశారు. జల్లాలోని 15 మండలాల్లో 8 జడ్పీటీసీ స్థానాలు మహిళలకు, 7 స్థానాలు జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు 5 (మహిళా-3, జనరల్-2), ఎస్సీలకు 2 స్థానాలు కేటాయించగా (వీటిలో ఒకటి మహిళా, మరొకటి జనరల్), జనరల్ 8 స్థానాలు (మహిళా -4, జనరల్-4) కేటాయించారు. జడ్పీ చైర్‌పర్సన్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు సంబంధించి ఎస్టీలకు 5 (మహిళా-2, జనరల్-3)గా నిర్ణయించారు. ఇక ఎస్సీలకు సంబంధించి 2 ( మహిళా- ఒకటి, జనరల్-1), జనరల్‌కు 6 (మహిళా-3, జనరల్-3), బీసీలకు 2 (మహిళా-1, జనరల్-1)గా రిజర్వు చేశారు.

జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కోవ లక్ష్మి..
జడ్పీ చైర్ పర్సన్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కోవ లక్ష్మి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేయడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కోవ లక్ష్మిని టీఆర్‌ఎస్ జడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లాలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు..
-కోవలక్ష్మి,మాజీ ఎమ్మెల్యే
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానల్లో టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలు,నాయకులు సమష్టిగా విజయం కోసం కృషి చేస్తాం. జిల్లా ప రిషత్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపైన నమ్మకంతో సీ ఎం కేసీఆర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా నా పేరును స్వయంగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా కృత జ్ఞతలు తెలిపుతున్నా. జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తా. అందరి సహకారంతో, ప్రజల అండదండ లతో ముందుకెళ్తా.

58
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles