అథర్వ్ కృషి అభినందనీయం

Wed,April 17, 2019 12:31 AM

-ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం
-జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ : ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అథర్వ్ వెల్ఫేర్ సొసైటీ కృషి అభినందనీయమని జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్స్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రజలకు యోగ్యమైన ఔషదాల గురించి చెప్పడంతో పాటు రోగాలు, అంటువ్యాధుల నుంచి రక్షణ కోసం ఎప్పటికప్పుడు ప్రజలను కాపాడేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం నాలుగు విభాగాల (ఆయుర్వేదిక్, యునాని, యోగ, హోమియోపతి) ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ వైద్యంతో ఎలాంటా హాని జరుగదన్నారు. ఈ అవగాహన సదస్సులో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, ఆయుష్ మెడికల్ అధికారి సుజాత, సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కావార్ సతీశ్, వెంకటేశ్, జోనల్ ప్రాజెక్టు మేనేజర్ పున్నం కుమార్ తాటికొండ, తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles