పకడ్బందీగా సర్వే నిర్వహించాలి

Wed,April 17, 2019 12:31 AM

-జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాగ్యలక్ష్మి
-రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే తీరు పరిశీలన
వాంకిడి : రైతు సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాశాఖ అధికారి భాగ్యలక్ష్మి సిబ్బందికి సూచించారు. మండలంలోని ఖమాన, తేజపూర్, బెండార, వాంకిడి మండల కేంద్రంలో మంగళవారం వేర్వేరుగా రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే నిర్వహించారు. బెండారలో నిర్వహిస్తున్న సర్వేను ఆమె సందర్శించి, సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే ద్వారా ప్రతి రైతూ సేద్యపు వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. రైతుల సామాజిక స్థితి, భూమి వివరాలు, విస్తీర్ణం, నేల రకం, నీటి వసతి, మార్కెటింగ్, పంటల సాగు వివరాలు, పశుగణన, తదితర రైతుల పూర్తి వివరాలు సేకరించి డేటాబేస్‌లో పొందుపర్చనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వ్యవసాశాఖ ద్వారా అందించే ఏ పథకలనైనా రైతు డేటాబెస్ ముఖ్య భూమిక పోషించనున్నందున రైతులు ఖచ్చితమైన వివరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మే 15వ తేదీ వరకు మండలంలో రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ఏఈవో తండవ్‌కృష్ణ రైతుల పేర్లు, పట్టాపాస్‌బుక్, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, బ్యాంక్‌ఖాతా నంబర్, ఇలా 39 అంశాలతో కూడిన వివరాలను రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నారు. కార్యక్రమంలో ఏవో విలిన్‌కుమార్, ఏఈవోలు మానస, సావిత్రి పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles