రైతు బీమాతో అండ..

Wed,April 17, 2019 12:30 AM

-మండలంలో 6,094 మందికి వర్తింపు
-తొమ్మిది కుటుంబాలకు అందిన పరిహారం
వాంకిడి: తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నది. ఓ వైపు పెట్టుబడి సాయం చేయడానికి రైతు బంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ.8వేలు అందించడమే గాక.. మరోవైపు రైతు ఏ కారణం చేత అయినా మృతి చెందిన ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకవచ్చింది. పంటల సాగుకు ఇంటి నుంచి పొలానికి వెళ్లే రైతన్నలు తిరిగి ఇంటికి సురక్షితంగా వస్తారనే నమ్మకం లేదు. ఏళ్లుగా ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలు, ఇతరాత్ర కారణాలతో రైతులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు కుటంబాలను ఆదుకోవడానికి రూ.5లక్షలు బీమా వర్తించే విధంగా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. 18 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారందరికి బీమా సౌకర్యం పొందే అవకాశం ఉంది. గత ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం అందజేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా పరిహారం అందేలా చర్యలు చేపట్టారు. 2018 సంవత్సరం ఆగస్టు 15న రైతు బీమా పత్రాలు రైతులకు అందజేశారు. అప్పటి నుంచి బీమా అమలులోకి తీసుకవచ్చి ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తున్నది. వాంకిడి మండలంలో మొత్తం 7,374 మంది రైతులకు 6,094 మంది రైతు బీమా పథకానికి దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా, వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేసింది.
బీమా పరిహారం అందే విధానం
రైతు మరణాంతరం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, నామిని బ్యాంక్ పాస్‌పుస్తకం, నామిని ఆధార్‌కార్డు జిరాక్స్‌లతో పాటు గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి తీసుకున్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలి. వారు విచారణ చేసి ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రెండు రోజుల్లో నామిని బ్యాంక్‌ఖాతాలో పరిహారాన్ని బీమా సంస్థ జమ చేస్తుంది.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles