నేడే ఆఖరు

Mon,March 25, 2019 01:20 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ నామినేషన్ల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియనుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి ఇ ప్పటి వరకు నలుగురు అభ్యర్థులు ఆరు సెట్ల నా మినేషన్లను దాఖలు చేశారు. నేటితో గడువు ముగియనుండగా.. పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. 22వ తేదీన బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు రెండు సెట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ తరఫున నా యకులు ఒక సెట్, ఆయన తనయుడు రితీష్‌రాథోడ్ ఒక సెట్, నవప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కొ మురం వందన ఒక సెట్, మొత్తం ఆరు సెట్లు ఇ ప్పటి వరకు దాఖలయ్యాయి. ఇక అధికార పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గోడం నగేష్ రాష్ట్ర మంత్రి అల్లోల ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, టీడీడీసీ చైర్మన్ లోకభూమారెడ్డిలతో కలిసి ఉదయం 11.30గంటలకు జిల్లా ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్‌కు తన నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు.

గెలుపే లక్ష్యంగా..
లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ పక్క ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఆదిలాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ గోడం నగేశ్‌కు కేటాయించడంతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యచరణతో ముందుకు సాగుతున్నారు. ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలో సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశ నిర్ధేశం చేస్తున్నారు. శనివారం బోథ్ నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం కనిపించింది. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉండడంతో లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చని భావిస్తున్నారు. శనివారం బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలం నిపానిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆదిలాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles