ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Mon,March 25, 2019 01:20 AM

లింగాపూర్: లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ సత్యనారాయణ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోనేలా ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పా టు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామన్నారు. జైనూర్ సీఐ షాదీక్‌పాషా, లింగాపూర్, జైనూర్, సిర్పూర్ ఎస్‌ఐలు తిరుపతి, శ్రీనివాస్, రమేశ్, సీఆర్పీపీఎఫ్ బృందం పాల్గొన్నారు.

సిర్పూర్(యు): మండల కేంద్రంతో పాటు మహగాంలో సీఆర్పీపీఎఫ్ బలగాలతో కలిసి ఆసిఫాబా ద్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరికీ భయపడకుండా నిజాయతీగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ షాదీక్‌పాష, సిబ్బంది ఉన్నారు.

జైనూర్: మండల కేంద్రంలో డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలన్నారు. జైనూర్ సీఐ షాదీక్‌పాషా. ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles