ఈవీఎంలు రెడీ

Mon,March 25, 2019 01:20 AM

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గర పడటంతో అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పీవో, ఏపీవోలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ కొనసాగుతున్నది. శనివారం ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో జిల్లా ఎన్నికల అధికారులు బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్‌ల మొదటి దఫా ర్యాండమైజేషన్‌ను గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను బట్టి సెగ్మెంట్లవారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌లను కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈవీఎం, వీవీ ప్యాట్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్ 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

ర్యాండమైజేషన్ పూర్తి
ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో 2,079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక ఈవీఎంలో 1400ల వరకు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో 1400లకు పైగా ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. నిర్మల్‌లో 2, ముథోల్‌లో 1 పోలింగ్ బూత్‌ను అదనంగా పెంచారు. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాలకు సరిపడే ఈవీఎం, వీవీప్యాట్‌లను అందుబాటులో ఉంచారు. శనివారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మూడు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ర్యాండమైజేషన్‌ను చేశారు. లోక్‌సభ పరిధిలోని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ముథోల్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలవారీగా ఈవీఎం, వీవీప్యాట్‌లను కేటాయించారు. రోజువారిగా ఎన్నికల విధులు నిర్వహించే అధికారులతో ఎన్నికల నియమావళిపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ సలహాలు సూచనలు అందజేస్తున్నారు.

ఈవీఎం, వీవీప్యాట్‌ల కేటాయింపు..
ఎన్నికలకు ఈవీఎం, వీవీప్యాట్లను అధికారులు సిద్ధం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాంకేతిక నిపుణులతో ఈవీఎంల పనితీరును పరిశీలించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఈవీఎంలు మొరాయించడంతో ముందస్తుగానే జిల్లా ఎన్నికల అధికారులు సాంకేతిక నిపుణులతో వాటికి మరమ్మతులు చేయించారు. నియోజకవర్గాలవారీగా పోలింగ్ బూత్‌లను పరిశీలించి సదుపాయాలు లేని చోట సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులు ప్రతి పోలింగ్ బూత్‌ను సందర్శించి నివేదికలను తయారు చేశారు. మూడు జిల్లాల ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీల నాయకులతో ఈవీఎం, వీవీప్యాట్‌లకు ర్యాండమైజేషన్ పూర్తి చేశారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles