మెజార్టీయే లక్ష్యం

Sat,March 23, 2019 11:57 PM

- ఎంపీ అభ్యర్థి గెలుపునకు కలిసికట్టుగా..
- ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో భేటీలు
- మండలస్థాయిలో కార్యకర్తలతో సమీక్షలు
- ఆదిలాబాద్ లోక్‌సభ గెలుపుపై అల్లోల దృష్టి

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని పదిలంగా నిలు పుకునేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు కసరత్తు ప్రారంభించారు. సిట్టింగ్ ఎంపీ జీ నగేశ్ ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు శని వారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సమా వేశమయ్యారు. సమన్వయంతో ముందు కెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని పదిలంగా ఉంచుకునేందుకు టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు అవసరమైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ లోక్‌సభ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించేలా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మంత్రి నేతృత్వంలో లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యారు. తాజాగా మం డలాల వారీగా ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజు నాలుగైదు మండలాలు పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఖానాపూర్, కడెం, జన్నారం మండలాల్లో పర్యటించి కార్యకర్తలతో లోక్‌సభఎన్నికలపై సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీ నగేశ్‌తో కలిసి పలు సమావేశాల్లో పాల్గొన్నారు. బోథ్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులతో రెండుచోట్ల బోథ్ నియోజకవర్గ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఇచ్చోడలోని ఎంపీ నగేశ్ ఇంట్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి నగేశ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే కోవలక్ష్మి, టీఎస్ డీడీసీ ఛైర్మన్ లోక భూమారెడ్డితో సమావేశమయ్యారు. పార్లమెంటరీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించారు. ఆయా నియోజకవర్గాల వారీగా సమీక్ష చేశారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో అందరిని కలుపుకొని వెళ్లాలని సూచించారు. నగేశ్ విజయానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. ఎంపీ అభ్యర్థి నగేశ్‌ను భార్టీ మెజార్టీతో గెలిపించాలని సూచించారు.

స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోండి
దహెగాం: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాల ని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య సూచించారు. మండల కేంద్రంలో శనివారం పోలీస్ కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలో అంగడీ బజారు, నికాడివాడ, చప్పిడవాడ, బుడిపల్లివాడ, ఎస్సీకాలనీలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. డీఎస్పీ మా ట్లాడుతూ నచ్చిన నాయకుడిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. ముఖ్యంగా యువత వ్యసనాలకు లొంగకుండా, తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలన్నారు. మద్యం, నగదుకు లొంగి ఎన్నికల్లో ఓటు వేయవద్దని సూచించారు. సీఐ వెంకటేశం, ఎస్‌ఐ శ్రీనివాస్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ క మాండర్ సునీల్‌కుమార్, పోలీసులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles