నాణ్యత పాటిస్తేనే ప్రోత్సాహకాలు

Sat,March 23, 2019 11:56 PM

తిర్యాణి : నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే ప్రోత్సాహాకాలకు అర్హులవుతారని జిల్లా నాణ్యత ప్రమాణాల అధికారి ధరంసింగ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన క్వాలిటీ అచ్యురెన్స్ పథకం కింద ఎంపిక చేసేందుకు శనివారం మండలంలోని గిన్నెధరి, రోంపల్లి, ప్రాథమిక వైద్యశాలలను పరిశీలించారు. ఈసందర్భంగా రోంపల్లి వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించి పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు, అలాగే సిబ్బందిని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాదన్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోనే రోంపల్లి పీహెచ్‌సీ పరిశుభ్రత పాటించినందున కాయకల్ప పథకం కింద ఎంపికయ్యిందని గుర్తు చేశారు. అంతేగాకుండా ప్రోత్సాహకార బహుమతి కింద రూ. 2 లక్షలను కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారన్నారు. దీనిలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్వాలిటీ అచ్యురెన్స్ అనే వినూతన్న పథకాన్ని ప్రవేశ పెట్టిందని చెప్పారు. దీని కింద ప్రసూతి గది, అడ్మినిస్ట్రేషన్, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వార్డ్, ల్యాబొరేటరి, నేషనల్ హెల్త్ ప్రోగ్రాం కండక్ట్ , ఈ ఆరు విభాగాల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో పరిశీలించామనీ, నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు. వీటి ఆధారంగా ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వ నాణ్యత ప్రమాణ అధికార బృందం పర్యటించి కేంద్రానికి తమ నివేదికలు పంపనుందని తెలిపారు. వారి నివేదికల్లో సంతృప్తి చెందిన పీహెచ్‌సీకి రూ.2 లక్షల బహుమతిని అందించనున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో రోంపల్లి వైద్యాధికారి మురళీదర్, హెల్త్ ఎడ్యుకేటర్ రషీద్, జూనియర్ అసిస్టెంట్ మార్క శంకర్ గౌడ్, వైద్య సిబ్బంది పలువురున్నారు.

62
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles