ఓటుతో నంబర్-1 నాయకుడిని ఎన్నుకోవాలి..

Sat,March 23, 2019 11:56 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పద్దెనిమిదేళ్లు నిండిన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ ఓటింగ్ పెంచడం కోసం నమోదుకు చాలా అవకాశాలు కల్పించింది. మీడియా, అధికారులతో ప్రచారం చేయించింది. ఓటు విలువను తెలియజేస్తూ కళాజాత ప్రదర్శనలు నిర్వహించింది. అనేక మంది ప్రభావితులై బూత్‌లెవల్‌లో సిబ్బందితో, ఆన్‌లైన్‌లో కూడా ఐప్లె చేసుకున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల వేళ సదావకాశాన్ని చాలా మంది యువత ఉపయోగించుకున్నారు. ఈ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికల కోసం కూడా మరోమారు నమోదు, మార్పులు-చేర్పులకు చాన్స్ ఇచ్చారు. అనేక మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో కూడా వెల్లువలా దరకాస్తులు వచ్చాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో యువత ఓటు పోటెత్తనుంది. నూతన రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉంది. ఓటు వేయడం ద్వారా మనకు నచ్చిన నాయకుడిని మనం ఎన్నుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఓటు ఉన్నా వేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

అలా చేస్తే మన కంటిని మనే పొడుచుకున్నట్లు అవుతుంది. చాలా సందర్భాల్లో ఈ నాయకులు ఇలా ఉంటే బాగుండు. అలా ఉంటే బాగుండు అని బంధువులు, స్నేహితుల వద్ద వాపోతాం. అదే ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకుంటే వాడ, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. మనమే మొదలు మేలుకోవాలి. ఓటు వేయాలి. పది మందిని ఓటు వేయించేట్టు చేయాలి. అప్పుడు వంద శాతం పోలింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచి నాయకుడిని ఎన్నుకుంటే దేశం ప్రగతి పథంలో పురోగమిస్తూ ప్రపంచంలోనే అగ్రదేశంగా పేరొందే అవకాశం ఉంటుంది. యువత మేల్కొవాలి. ప్రస్తుతం జాతీయ పార్టీల ప్రాధాన్యత తగ్గుతున్నది. ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతున్నది. ప్రధాన, పెద్ద పార్టీలు అని చెప్పుకునే బీజేపీ, కాంగ్రెస్‌లు దేశాన్ని అవినీతిలో కూరుకుపోయేట్టు చేశాయి. భారీ స్థాయిలో కుంభకోణాలకు పాల్పడ్డాయి. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 55 ఏండ్లు, బీజేపీ 11 ఏండ్లు దేశాన్ని పాలించాయి. సంస్కరణలు తీసుకురావడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. పెద్ద పార్టీలు పోయి ప్రాంతీయ పార్టీలు ఢిల్లీ గద్దెనెక్కాలి. దేశానికి దిక్సూచిలా ఉండే తెలంగాణ వంటి పాలన రావాలి. తెలంగాణ నినాదం కాకుండా విధానంలా మారాయి. అందుకే దేశం మెచ్చిన, ప్రజలు నచ్చిన దేశంలోనే పసిగుడ్డు వంటి తెలంగాణను నంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్ వంటి నాయకుడు దే శానికి కావాలి.. రావాలి..అయనే ప్రధాని కావాలి.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles