గులాబీ దళపతి వస్తున్నారు..

Sat,March 23, 2019 11:54 PM

పెద్దపల్లి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 1వ తేదీన పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 29వ తేదీ నుంచి మలి విడత ప్రచారం ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏప్రిల్ 1వ తేదీన రామగుండంలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు రామగుండం అనువుగా ఉంటుందని సభ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. అయితే బహిరంగ సభ రామగుండంలో ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఫైనల్ కాలేదు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles