వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Sat,March 23, 2019 11:54 PM

మంచిర్యాల జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు.

తాండూర్: లారీ, ఆటోను ఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మండలం రేపల్లెవాడ సమీపంలో మంచిర్యాల జిల్లా సరిహద్దులో జాతీ య రహదారిపై శనివారం సాయంత్రం చోటు చే సుకుంది. ఎస్‌ఐ కొత్తపల్లి రవి, స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న తాం డూరుకు చెందిన జంబోజుల ప్రశాంత్ (25) రెబ్బె నకు భార్య నహీమాతో కలిసి ఆటో (ఏ1వై 2099) లో వెళ్లి, తిరుగు ప్రయాణంలో రెబ్బెన నుం చి ఐబీ వైపు ప్యాసింజర్‌ను ఎక్కించుకుని వస్తున్నా డు. ఎదురుగా వస్తున్న కర్ర లోడుతో ఆంధ్రా నుంచి బల్లార్షకు వెళ్తున్న లారీ (టీఎన్16సీ 1441) ఆటో ను ముందు నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నడుపుతున్న ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన భార్య నహీమ, ప్రయాణికుడు తిర్యాణి మండలం ఏదులపాడుకు చెందిన జగదీశ్ కు తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108లో బెల్లంప ల్లి ప్రభుత్వ దవాఖానకు, అక్కడి వైద్యుల సూచ నలతో మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల దవా ఖానకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ రవి మృతదేహాన్ని పంచనామా కోసం బెల్లం పల్లి దవాఖానకు తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆగి ఉన్న లారీని ఢీకొని..
దండేపల్లి: మండలంలోని ముత్యంపేట అటవీ చెక్‌పోస్ట్ వద్ద నిలిపి ఉన్న లారీని ఢీకొని జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన సూరినేని లచ్చయ్య(48) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చన్న లక్షెట్టిపేట నుంచి రాం పూర్‌కు శనివారం బైక్‌పై వస్తున్నాడు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ఢీ కొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంజీవ్ తెలిపారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles