ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం

Sat,March 23, 2019 12:10 AM

- ఉత్సాహంగా ఓటేసిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఎమ్మెల్సీ పోరు ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగగా టీచర్లు, గ్రాడ్యుయేట్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి, ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పట్టభద్రుల ఎమ్మెల్సీకి 2678 ఓట్లతో 61.45శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 383 ఓట్లు పోల్ కాగా 77.69 శాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరుగగా, కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలో 12 పాత మండలాల పరిధిలో కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో 4,355 మంది పట్టభద్రులకు 2,676 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 493 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 383 మంది తమ ఓటు హక్కువినియోగించుకున్నారు. మొత్తంగా 61.45 శాతం పట్టభద్రులు, 77.69 శాతం మంది ఉపాధ్యాయ ఓటర్లు పోలింగ్ నమోదైంది.

ప్రశాంతంగా ఎన్నికలు..
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎ లా ం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలో 4,355 మంది పట్టభద్రులలో 3,117 పురుషులు, 1238 మహిళ లు ఉన్నారు. వీరిలో 2031 మంది పురుషులు, 645 మంది మహిళలు ఓటు వేశారు. అలాగే ఉపాధ్యాయ ఓటర్లు జి ల్లాలో 493 మంది ఉండగా వీరిలో 352 మంది పురుషు లు, 141 మహిళా ఉపాధ్యాయులు ఉండగా, వీరిలో 276 మంది పురుషులు, 107 మంది మహిళలు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles