ముగిసిన పోషణ్ అభియాన్

Sat,March 23, 2019 12:09 AM

సిర్పూర్(టి) : గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని అంగన్‌వాడీ టీచర్లు ఉమాదేవి, సాధికాబేగం పేర్కొన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని గంగాయిగూడ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు సీ మంతం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌష్ఠికాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అర్చన, కల్పన, అంగన్వాడీ ఆయాలు, గర్భిణులు పాల్గొన్నారు.

బెజ్జూర్ : మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంతో పాటు, ఇన్న సిద్దాపూర్ కేంద్రాల్లో శుక్రవారం గర్భిణులకు సీమంతం నిర్వహించారు. అనంతరం వారు మా ట్లాడు తూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు తదితర పౌష్టికాహారాలను గర్భిణులు తీసుకోవాలని సూ చించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీలు రమా శ్రీ, స్వప్న, గర్భిణులు, కిశోర బాలికలు, మహిళలు పాల్గొన్నారు.

క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలి
పెంచికల్‌పేట్: చిన్నారులు, గర్భిణులు, బాలింతలు క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మ అన్నారు. శుక్రవారం సంజయ్‌నగర్‌తో పాటు చేడ్వాయి, దరొగపల్లి, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన కల్పించి గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్న ప్రాసన చేశారు. అంగన్వాడీలు చంద్రకళ, అబ్దుల్ ఉన్నిసా, ఆశ కార్యకర్త , తదితరులు ఉన్నారు.

కాగజ్‌నగర్ టౌన్: పట్టణంలోని బజార్ ఏరియా, ఇందిరానగర్, జైభీం కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం గర్భిణులకు సామూహిక సీమంతాలు చేశారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ భద్రమ్మ, భాగ్యలక్ష్మి మా ట్లాడుతూ గర్భిణులు ఆకుకూరలు, పోషకాహారం తీసు కుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్ త్రివేణి, మైమూన, రమా దేవి, గర్భిణులు, చిన్నారులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

కౌటాల: మండలంలోని కనికి అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులకు సామూహిక సీమంతలు నిర్వహించారు. అనంతరం రక్తహీనత, పౌష్ఠికాహారంపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles