గ్రామాల అభివృద్ధికి పెద్దపీట

Sat,March 23, 2019 12:09 AM

దహెగాం: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని కొంచవెల్లి, పీకలగుండా, చంద్రపల్లి, చిన్నరాస్పల్లి, ఒడ్డుగూడ, తదితర గ్రా మాల్లో శుక్రవారం పర్యటించారు. గ్రామీణ ప్రాంతా ల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం కోట్లాది రూపాయ లు కేటాయిస్తుందన్నారు. వ్యవసాయానికి కూడా ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కలిపిస్తుందని సాగుకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో రైతులు రెండు పంటలను సాగు చేస్తూ తీరిక లేకండా వ్యవసాయ పనుల్లో ఉంటున్నారనీ, ఫలితంగా రైతు కు టుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. అనంతరం ఎర్రవాగుపై రూ. 30 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించా రు. పనుల వేగం పెంచి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. జడ్పీటీసీ లావుడె సుజాత, రైతు సమన్వయ కంటి మండల కన్వీనర్ కంబగౌని సంతోష్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్‌రాజ్, సిగిల్‌విండో ఉపాధ్యక్షుడు కోండ్ర తిరుపతిగౌడ్, నాయకులు దామోదర్‌గౌడ్, రౌతు రాజన్న, అల్గం మల్లేశ్, సంగర్స్ మోహన్‌రా వు, పుప్పాల సంతోష్, తుమ్మిడ పాపయ్య, బాలు నాయ క్, చౌదరి సురేశ్, ప్రకాశ్‌గౌడ్, ప్రశాంత్, హట్కరి మధూకర్, దామోదర్ పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles