గర్భిణులు పౌష్ఠికాహారం తీసుకోవాలి

Sat,March 23, 2019 12:09 AM

కాగజ్‌నగర్ రూరల్: గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి సావిత్రి సూచించారు. మండలంలోని బురదగూడలో పోషణ్ అభియాన్ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వారు గర్భిణులు, బాలింతలకు ఏఏ ఆహారంలో ఏఏ పోషకా లు ఉంటాయో అవగాహన కల్పించారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి తాము అందిస్తున్న ఆహారం తీసుకోవాలనీ, ఆకు కూరలు, విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆ రోగ్యంగా ఉంటాడన్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులతో నృత్యాలు చేయించారు. అంగన్‌వాడీ కేం ద్రం పరిధి లోని తొమ్మిది మంది గర్భిణులకు సీమంతం చేశా రు. ప్రాజెక్ట్ అధికారి సురేఖ, సూపర్‌వైజర్ బద్రమ్మ, భాగ్యలక్ష్మి,విజయలక్ష్మి, సర్పంచు స్వాతి, ఏఎన్‌ఎం, హెచ్‌ఎం ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles