కారు ఖరారు

Fri,March 22, 2019 01:45 AM

1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా,గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
2000 నుంచి 2003 వరకు పీఏసీ మెంబర్‌గా ఉన్నారు.
2001 నుంచి 2003 వరకు 610 జీవో హౌజ్ కమిటీ మెంబర్‌గా పని చేశారు.
2010 నుంచి 2014 వరకు అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీలో పని చేశారు. హెచ్‌ఆర్‌డీ బడ్జెట్ స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా కొనసాగారు.
2014 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంట్‌లో బొగ్గు ఖనిజాల స్టాండింగ్ కమిటీలో సభ్యునిగా, సోషల్ జస్టిస్, ఎంపవర్‌మెంట్ కాన్సల్టేటివ్ కమిటీలో సభ్యునిగా ఉన్నారు.

నిర్మల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి గెడాం నగేశ్ పేరును టీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీకే మరోసారి అవకాశం కల్పించారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన గెడాం నగేశ్ వరుసగా రెండోసారి టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన ఈనెల 25న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో సీనియర్‌గా వివాదరహితుడిగా పేరున్న నగేశ్‌కు టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి అవకాశం కల్పించింది.
తండ్రి, కొడుకులు ఇద్దరు మంత్రులే..
బోథ్ నియోజకవర్గానికి చెందిన గెడాం నగేశ్ గొండు సామాజిక వర్గానికి చెందినవారు. బజార్‌హత్నూర్ మండలం జాతర్ల గ్రామ వాస్తవుడైన ఆయన రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉంది. మాజీ మంత్రి గెడాం రామారావుకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో టీడీపీ నుంచి బోథ్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కే.చౌవాన్‌పై విజయం సాధించారు. 1999లో మరోసారి టీడీపీ నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి కొడప కోసురావుపై గెలిచారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓడిపోయారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేయ గా.. కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌జాదవ్‌పై విజయం సాధించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఆదిలాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన తండ్రి గెడాం రామారావు రెండుసార్లు గెలువగా.. గతంలో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేస్తే నగేశ్ చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. ఇలా తండ్రి, కొడుకులు ఇద్దరూ మంత్రులైన ఘనత వీరికే దక్కింది.

2014లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ ఓట్ల మెజార్టీతో ఎంపీగా గెలిచారు. తాజాగా కూడా ఎంపీ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ పార్టీ ఆయనకే అవకాశం కల్పించింది. క్షేత్రస్థాయిలో కేడర్‌తో మంచి సంబంధాలు ఉండటం, లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమన్వయం, సత్సాబంధాలు ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు కాగా.. మిగతా నాలుగు నియోజకవర్గాలు జనరల్ స్థానాలుగా ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల్లోని కేడర్‌తో ఆయనకు మంచి సంబంధాలుండటంతో బాగా కలిసి వస్తోంది. గొండు సామాజిక వర్గానికి చెందిన ఆయన లంబాడా, ఇతర వర్గాల వారితోనూ సత్సబంధాలు ఉండటం అందరి పనులను చేయడం, అందరిని కలుపుకోని పోవడంతో ఆయనకు అందరి మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజల్లో టీఆర్‌ఎస్, ప్రభుత్వంపై ఉన్న పూర్తి సానుకూలతతో ఆయన గెలుపు సులువు కానుంది.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles