మండలి పోలింగ్‌కు సిద్ధం

Fri,March 22, 2019 01:44 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న శాసన మండలి ఎన్నికలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉపాధ్యాయ ఓటర్ల కోసం 12, పట్టభద్రుల ఓటర్ల కోసం 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, గురువారం సిబ్బందికి సామగ్రిని పంపిణీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌శాఖ పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ స్థానానికి ఏడుగురు, పట్టభద్రుల స్థానానికి 17 మంది పోటీ పడుతుండగా, గెలుపెవరిదో త్వరలో తేలనున్నది.

జిల్లాలో శుక్రవారం జరగనున్న శాసన మండలి ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 12 మండలాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేసిన అధికారులు, ఓటర్లకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. జిల్లాలోని 15 మం డలాల్లో 493 మంది ఉపాధ్యాయ ఓటర్లు, 4355 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయు లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 12, పట్ట భద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 13 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఎన్నికల నిర్వ హణ కోసం ఐదుగురు జోనల్ అధికారులు, 18 మంది పీవోలు, 40 మంది ఏపీవోలు, 35 మంది ఓపీవోలు, 14 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇద్దరు నో డల్ అధికారులను ఎన్నికల సంఘం నియమించిం ది. పట్టభద్రుల ఓటు కోసం 4860 తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలు, ఉపాధ్యాయ ఓటు కోసం 550 గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్, వీడియో గ్రా ఫర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ పర్యవేక్షణలో ఇదరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 13 మంది ఎస్‌ఐలు, 200 మంది కానిస్టే బుళ్లను భద్రత కోసం ఎన్నికల సంఘం నియమిం చింది. శాసన మండలి ఎన్నికల్లో పోటీలో ఉన్న అ భ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగించారు.

ఉపాధ్యాయ, పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపు కోసం అనేక ఆ యా సంఘాల మద్దతులో తమ దైన శైలిలో ప్రచా రాలు చేశారు. పట్టభద్రల స్థానం నుంచి పోటీ పడు తున్న మామిడ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు అధికార పార్టీ టీఆర్‌ఎస్ నుంచి మద్దతు ఉండడంతో దాదాపుగా పట్టభద్రుల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ శ్రే ణులతో కలిసి పట్టభద్రుల ఓటర్లతో సమావేశాలు ని ర్వహించి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేశారు.

51
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles