కార్మిక కాలనీల్లో హోలీ..

Fri,March 22, 2019 01:43 AM

రెబ్బెన : బెల్లంపల్లి ఏరియా లోని గోలేటిటౌన్‌షిప్ కార్మిక క్షేత్రంలో హోళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గోలేటిటౌన్‌షిప్‌లోని అధికారుల బంగ్లా ఏరియా లో జీఎం రవిశంకర్, సేవా అధ్యక్షురాలు అనురాధ పాల్గొన్నారు.సీ టైప్, డీ టైప్ క్వార్టర్స్ లో మహిళలు, యువకులు, చిన్నారులు ఒకరికి ఒకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆయా కార్యక్రమల్లో అధికారుల సంఘం అధ్యక్షుడు చింతల శ్రీనివాస్, ప్రాజెక్టు ఆధికారులు మోహన్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, పలువురున్నారు.

సీసీసీ నస్పూర్ : కోల్‌బెల్ట్ ప్రాంతమైన సీసీసీ నస్పూర్ కార్మిక వాడలైన నస్పూర్‌కాలనీ, గోదావరికాలనీ(షిర్కె), నాగార్జునకాలనీ, బంగ్లాస్ ఏరియా, న్యూ నాగార్జునకాలనీ, సీసీసీ ఆర్‌కే-5కాలనీ, బ్యారెక్స్‌లో నివాసముంటున్న కార్మిక కుటుంబాలు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి కాలనీల్లోని మహిళలు, యువతీ, యువకులు రకరకాల రంగులు చల్లుకున్నారు. ఆయా వాడల్లో డీజే సౌండ్స్, హోం థియేటర్లలో పాటలు పెట్టుకుని నృత్యాలు చేశారు. మహిళలు, యువకులు, కార్మికులు ఒక జట్టుగా ఏర్పడి సమీప ఇళ్లలో తిరిగి రంగులు పూసుకుని ఒకరినొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. బంగ్లాస్ ఏరియాలో జీఎం సుభానీతో పాటు పలువురు అధికారులకు శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డితో పాటు పలువురు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles