కేంద్రంలో కీలకం కావాలి...అల్లాడి రాములు, రిటైర్డ్ టీచర్

Fri,March 22, 2019 01:42 AM

కౌటాల : స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి భారత దేశాన్ని కాంగ్రెస్, బీజేపీ పార్టీలే దేశాన్ని పాలించాయి. కానీ ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదు. ఆ నాయకుల సంపాదనే పైనే దృష్టి పెట్టారు. ప్రజల అవసరాలను గుర్తించడం, వాటిని తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల కనీస అవసరాలు, విద్య, ఉద్యోగం, వైద్యం అందించడంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు. ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలో సాగుకు, తాగుకు సరిపడా నీరున్నా.. అది అందించడంలో నిర్లక్ష్యం చేశారు. నిరుపేదలకు అందాల్సిన ఉన్నత చదువులు ఏ మాత్రం అందకపోగా.. దాని గురించి ఆలోచనే లేకుండా పోయింది. నిరుపేదలకు అందించాల్సిన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో కనీస అవసరాలైనా తాగు నీరు, కరెంట్, రవాణా సౌకర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చే నిధుల్లో పారదర్శకత పాటించడం లేదు. క్రేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధివిధానాలతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.

కేంద్రం నుంచి నిధులు రాకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఊహించని విధంగా పథకాలను అందిస్తున్నది. అన్ని వర్గాలు, అన్ని మతాలకు సమన్యాయం చేస్తూ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో మన తెలంగాణ 16 సీట్లు సొంతం చేసుకుంటే దేశాన్ని శాసించే అధికారం మన చేతుల్లోకి వస్తుంది. అప్పుడు మనకు రావాల్సిన నిధులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సాధించుకో గలుగుతాం. తెలంగాణకు అందాల్సిన ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పారిశ్రామిక సంస్థలు సంపాదించుకోగలుగుతాం. ప్రజలంతా ఓటు వేసే ముందు ఆలోచించాలి. దేశంలో క్రీయాశీలక పాత్ర పోశించాలన్న, సుస్థిర పాలన కొనసాగాలన్న మన తెలంగాణ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles