అద్దంలా అంతర్గత రోడ్లు

Fri,March 22, 2019 01:42 AM

కౌటాల: ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు తెలంగాణ వచ్చిన తర్వాత అంచలంచలుగా పరిష్కారమవుతున్నాయి. గ్రామాల్లోని అంతర్గత రోడ్లు గతంలో అధ్వానంగా ఉండగా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను అద్దంలా మారుస్తున్నారు. మండలంలోని మొగడ్‌దగఢ్ గ్రామంలో మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 26లక్షలతో గ్రామంలోని రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో ఎన్నో ఎండ్లుగా బురదమయంగా ఉండే అంతర్గత ర హదారులు సిమెంట్ మయంగా మారాయి. దీంతో సమస్యలు తొలిగాయని గ్రామస్తులు అంటున్నారు. ప్రతి గల్లీకి సిమెంట్ రోడ్లు వే స్తుండడంతో గ్రామం సుందరంగా కనిపిస్తుంది. రోడ్ల నిర్మాణంతో గ్రామాల్లో వర్షకాలం ఇబ్బం ది లేకుండా అవుతుంది. గతంలో వర్షకాలం వచ్చిందంటే ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా పోయింది.

ఇంత అభివృద్ధి చూడ లేదు
మా ఊరిలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత అభివృద్ధి చూడలేదు. తె లంగాణ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఎమ్మెల్యే కోనే రు కోనప్ప సహకారంలో ఈ ఏడాది మా గ్రామాని కి ప్రత్యేక నిధులు వచ్చాయి. దీంతో అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో అభివృద్ధికి అమాడ దూరంలో మా గ్రామం ఉండేంది.
- ఉర్వత్ బాజీరావు, గ్రామస్తుడు

రోడ్లు మంచిగైనై
మా ఊరులోని రోడ్ల న్నీ ఇప్పుడు మంచిగైన యి. గతంలో వానాకా లం వస్తే ఎటు చూసినా బురద మయంగా కని పించేంది ఇప్పటి మా ఊ రిలో మొత్తం సిమెంట్ రోడ్లు అయినై. మా ఊరిలోని గతంలో వర్షాకాలం ఏటు వెళ్లాలన్నా నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పడు ఇంటి వరకు మోటర్ సైకిల్, ఆటోలు వస్తున్నాయి. ఆనందంగా ఉంది.
- బాదన్ విలాస్, గ్రామస్తుడు

అభివృద్ధిలో పాలు పంచుకుంటాం
గ్రామాభివృద్ధికి యు వకులం కలిసికట్టుగా స హాయ సహకారాలు అం దిస్తాం. గ్రామానికి వచ్చే నిధులను ఏఏ పనులకు వినియోగించాలో సర్పం చ్‌కు సలహాలు సూచన లు ఇస్తాం. యువకులు ఏకమై గ్రామాన్ని మ రింత ముందుకు తీసుకెళ్తాం. ఎమ్మెల్మే ప్రత్యేక నిధులు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. వీటి తో మరిన్ని సౌకర్యాలు కల్పించుకుంటాం.
- పాల్కె రవి, గ్రామస్తుడు

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles