ఊరూరా కాముడి దహనం

Thu,March 21, 2019 12:24 AM

జైనూర్/కెరమెరి/కాగజ్‌నగర్‌టౌన్/ సిర్పూర్(యు)/ ఆసిఫాబాద్, నమస్తేతెలంగాణ: హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా కాముడి దహనం వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు)లో ఆదివాసీలు తమ సంప్రదాయ పద్ధతుల్లో కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఆదివాసులు గిరి గ్రామాల్లో ప్రతి కుటుంబం నుంచి కూడకలు సేకరించారు. వెదురు కర్రలకు కూడకలు, చక్కర బిల్లలు కట్టి సంప్రదాయ బద్దంగా పూజలు చేసి కాముడి దహనం చేశారు. మంటలలో కాలిపోయిన కంకలు కిందపడకుండా దుస్తులతో వాటిని సేకరిస్తారు. ఆదివాసీలు సంప్రదాయ వాయిద్యాల నడుమ చుట్టు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. కాగజ్‌నగర్‌లోని హనుమాన్ టెంపుల్, సర్‌సిల్క్ చౌరస్తా, న్యూ కాలనీ, నౌగాం బస్తి, సుభాష్‌చంద్రబోస్ కాలనీ, బాలాజీనగర్, తిలక్‌నగర్‌ల్లో ప్రజలు కాముడి దహనం చేశారు.

54
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles