తల్లి ఒడికి చేరినట్లుంది

Thu,March 21, 2019 12:23 AM

నేరడిగొండ(ఆదిలాబాద్ జిల్లా): తాను చాలా కాలంగా ఇతర పార్టీలో పని చేసి చివరకు తల్లి ఒడికి చేరినట్లుందని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి జాదవ్ అనిల్ పేర్కొన్నారు. బుధవారం నేరడిగొండ నుంచి ఆయన వర్గీయులతో పెద్ద సంఖ్యలో వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. జాదవ్ అనిల్‌కు గులాబీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాదవ్ అనిల్ మాట్లాడుతూ, తాను 2001 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కీలకంగా పని చేసి అప్పుడు బోథ్ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశానని పేర్కొన్నారు. పరిస్థితుల కారణంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి తిరిగి టీఆర్‌ఎస్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేవలం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు అందించడం చూసే తాను పార్టీలో చేరినట్లు చెప్పారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించడం రెండో దఫా కూడ మళ్లీ అధికారంలోకి రావడం అభినందనీయమన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ పార్టీ పటిష్టతకు, నిబద్దతతో కార్యకర్తగా పని చేస్తానన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ బంగారు తెలంగాణలో భాగస్వామినవుతానని చెప్పారు. ముందుగా కేటీఆర్‌కు పుష్పగుచ్చం అందించి, శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడం నగేశ్, ఢిల్లీ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, డెయిరీ చైర్మన్ లోక భూమరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు నాయకులే కరువాయే..
బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కరువయ్యారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన జాదవ్ అనిల్ టీఆర్‌ఎస్‌లో చేరగా, మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు బీజేపీలో చేరారు. మరో నాయకుడు కుమ్రం కోటేశ్వర్ కూడా టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భవిష్యత్తులో కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అందరి చూపు టీఆర్‌ఎస్ వైపే ఉంది.

52
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles