పాతూరిని అధిక మెజార్టీతో గెలిపించండి

Thu,March 21, 2019 12:23 AM

రెబ్బెన : పీఆర్టీయూ బలపరుస్తున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పర్వతి రాజేశ్వర్‌రావు పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆరు సంవత్సరాలుగా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారానికి శాసన మండలి వేదికగా పాతూరి ఎనలేని కృషి చేశారన్నారు. పీఆర్సీ బకాయిలు చెల్లింపులు, 43శాతం ఫిట్‌మెంట్ సాధించడంతో పాటు కాంట్రాక్టు లెక్చరర్లకు, జూనియర్ లెక్చరర్లతో సమాన వేతనాలు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించనట్లు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న పాతూరి సుధాకర్‌రెడ్డిని భారీ మోజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ బరిలో ఉన్న పాతూరికి అందరూ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కటకం మధుకర్, శ్రీకాంత్, శ్యాంసుందర్, చంద్రశేఖర్, సోమశేఖర్ పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles