రెబ్బెన, గోలేటిలో బలగాల కవాతు

Thu,March 21, 2019 12:23 AM

రెబ్బెన : మండలంలోని రెబ్బెన, గోలేటిలో కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులు బుధవారం కవాతు నిర్వహించారు. రెబ్బెనలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ జెండా ఊపి కవాతును ప్రారంభించారు. ఈ కవాతు గంగాపూర్ ఆర్చ్ వరకు కొనసాగింది. గోలేటిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి జీఎం కార్యాలయం వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతమైన, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకే కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు అందరూ సహకరించాలనీ, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ వీవీ రమణమూర్తి, ఎస్‌ఐ దీకొండ రమేశ్, సాయుధ బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.

తిర్యాణి : మండలకేంద్రంలోని కుమ్రం భీం చౌరస్తా నుంచి చింతపల్లి వరకు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles