ముగిసిన మండలి ప్రచారం

Thu,March 21, 2019 12:23 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరీంనగర్ ఎమ్మెల్సీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో తమ మద్దతుదారులతో కలిసి అభ్యర్థులు ఓట్లు అభ్యర్థించారు. ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక విధాలా ప్రయత్నాలు చేశారు. పట్టభద్రుల స్థానం నుంచి పోటీ పడుతున్న మామిడ్ల చంద్రశేఖర్ గౌడ్‌కు అధికార పార్టీ టీఆర్‌ఎస్ మద్దతు ఉండడంతో పార్టీ శ్రేణులు, వివిధ సంఘాలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ శ్రేణులతో కలిసి పట్టభద్రుల ఓటర్లతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డి.. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో ఉపాధ్యాయుల ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీలు ఇస్తున్నారు. కొత్త పీఆర్సీ సాధించడం, సీపీఎస్ రద్దు, ఏకీకృత సర్వీసు రూల్స్ సాధన వంటి సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు.

పోలింగ్‌కు ఏర్పాట్లు..
ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బందిని నియమించారు. మార్చి 22న నిర్వహించనున్న ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల కోసం దాదాపుగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటింగ్ కోసం 12 కేంద్రాలు, పట్టభద్రుల పోలింగ్ కోసం 13 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉపాధ్యాయ ఓటర్లు 493 మంది, పట్టభద్దుల ఓటర్లు 4355 మంది ఉన్నారు. ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మండలాలను ఐదు జోన్లుగా గుర్తించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఐదు జోన్‌లను ఏర్పాటు చేసిన అధికారులు జోనల్ అధికారులను నియమించారు. జోన్-1లోని ఆసిఫాబాద్, వాంకిడి మండలాల జోనల్ అధికారిగా పంచాయతీరాజ్ ఈఈ వెంకట్రావ్, జోన్-2లోని రెబ్బెన, తిర్యాణి మండలాలకు ఫిషరీష్ అధికారి సాంబశివరావ్, జోన్-3లోని తిర్యాణి, కెరమెరి, జైనూర్ మండలాలకు ఎంపీడీవో బానోత్ దత్తారాం, జోన్-4లోని కాగజ్‌నగర్, దహెగాం మండలాలకు మున్సిపల్ కమిషనర్ తిరుపతి, జోన్-5లోని సిర్పూర్-టి, కౌటాల, బెజ్జూర్ మండలాలకు ఐ అండ్ సీఏడీడీ డిప్యూటీ ఈఈ వెంకట్రావ్‌ను జోనల్ అధికారులుగా నియమించారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles