పంట మార్పిడితో అధిక దిగుబడి

Thu,March 21, 2019 12:23 AM

బెల్లంపల్లి రూరల్: పంటమార్పిడితో అధిక దిగు బడి వస్తుందని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్ అన్నారు. మాలగురిజాలలో ఎస్సీ రైతుల కోసం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి రైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలనీ, వరి నాటిన 45 రోజుల వర కు ఎలాంటి పురుగు మందులను పిచికారీ చేయద్దన్నారు. సేంద్రియ పద్ధతి అవలంభిస్తే నాణ్యమైన దిగుబడి ఉంటుందని చెప్పారు. ఇక్కడి నేలల్లో అన్ని రకాల పంటలు పండించవచ్చని స్పష్టం చేశా రు. ఆసిఫాబాద్ జిల్లా ఉద్యానశాఖ అధికారి మోహ ర్ బాషా మాట్లాడుతూ రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలన్నారు. పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై దృష్టి సారించాలని సూచించారు. భౌగోళికంగా నేలల స్వభా వాన్ని గుర్తించి పంటలను వేసుకోవాలన్నారు. వ్య వసాయ అనుకూల భూముల్లో ఉద్యాన పంటలను వేసుకుంటే మంచి ఫలితాలుంటాయని సూ చించా రు. పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు.

ఆరు నెలల్లో చేతికందే ఆపి ల్ బేర్ సాగుపై దృష్టి పెట్టాలనీ, పూల తోటలతో అదనంగా ఆదాయం పొందవచ్చన్నారు. వెదురు, శ్రీగంధం మొక్కల పెంపకంపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. సాంకేతిక సలహాలు కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పెట్టుబడులు తగ్గించుకొని ఉత్పాదనలు పెంచుకుంటే రైతుల కు టుంబాలు బాగుపడతాయన్నారు. 2020 సంవత్సరం నాటికి రైతుల జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రతి గ్రామంలో సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పా రు. బెల్లంపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు సురేఖ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం తో పెట్టుబడులు పెరిగి నష్టం వాటిల్లుతుందన్నారు. నకిలీ పత్తి విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పచ్చిరొట్ట ఎరువులతో పాటు జీవ సంబంధితమైనవే వాడాలన్నారు. ఆత్మ ఏడీఏ శ్రీనివాస్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ శివకృష్ణ, బెల్లంపల్లి వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, అధికారి సుప్రజ పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles