మరిన్ని పతకాలు సాధించాలి

Wed,March 20, 2019 01:00 AM

- కిక్‌బాక్సింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన క్రీడాకారులకు జీఎం అభినందన
రెబ్బెన : బెల్లంపల్లి ఏరియాలోని క్రీడాకారులు కిక్ బాక్సింగ్ లో మరిన్ని పతకాలు సాధించి బెల్లంపల్లి ఏరియాకు మంచి పేరు తీసుకరావాలని బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్ క్రీడాకారులకు సూచించారు. ఇటీవల హిమచల్‌ప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం టీమ్‌లో బెల్లంపల్లి ఏరియా మదారం టౌన్‌షిప్‌కు చెందిన ఏ సుశ్రీత, జీ శీరీష, ఏ స్వాస్థిక్, సీహెచ్ మనోహర్ ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయిలో గోల్డ్‌మెడల్ సాధించారు. అక్కడే జరిగిన సెమినార్‌లో సుశ్రీత, శీరీష, స్వాస్థిక్‌లు జాతీయ స్థాయి రెఫరీలుగా ఎంపికయ్యారు. ఈ సంవత్సరం మేలో హంగేరి దేశంలో జరిగే వరల్డ్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్‌లో ఇండియా తరుపున సుమలత, శీరీష పాల్గొనున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జీఎం రవిశంకర్‌ను కలిశారు. క్రీడాకారులకు జీఎం రవిశంకర్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో రాణించి పతకాలు సాధించి ఏరియాకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు. క్రీడాకారులకు సింగరేణి తరుపున ఎల్లపుడు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఏ.రాజేశ్వర్, డీవైపీఎం రామాశాస్త్రి లు ఉన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles