పార్లమెంట్ ఎన్నికలకు ఇబ్బందులు తలెత్తవద్దు

Mon,March 18, 2019 11:37 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ మల్లారెడ్డితో కలిసి తహసీల్దా ర్లు, పోలీసు సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సమస్మాత్మక , మావోయిస్టు ప్రాబ ల్య ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లకు నంబర్లు ఇవ్వడంతోపాటు, ర్యాంపులు నిర్మించాలని, ఇతర అన్ని వసతులు కల్పించాలని సూచించారు. సిబ్బందికి వీవీప్యాట్లపై పూర్తి అవగాహన ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని ఫాం -6 పెండింగ్‌లో లేకుం డా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో ప్రిసైడింగ్, సెక్టోరియల్ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ఏ-2 రకం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామనీ, దీనిపై అధికారులకు తప్పనిసరిగా పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

ఎన్నికలకు ఒక రోజు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సారి ఎన్నికల్లో కొత్త ఫారంలతో పాటు నిబంధనల్లో కూడా మార్పులు, చేర్పులు ఉంటాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. చెక్‌పోస్టుల్లో వాహనాల తనిఖీలకు సంబంధించి రికార్డులను నిర్వహించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లాలో 120 సమస్యాత్మక, 73 మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్‌పార్టీలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జేసీ రాంబాబు, డీఎస్పీలు సత్యనారాయణ, సాంబయ్య, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్లు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles