గోండుగూడకు సీసీ రోడ్డు కళ

Mon,March 18, 2019 11:35 PM

-రూ.15లక్షలతో నిర్మాణం
-హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
రెబ్బెన: మండలంలోని గోలేటి గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ(దుగ్గపూర్) గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డుతో గ్రామస్తులకు ఇబ్బందులు దూరమయ్యాయి. సింగరేణి ప్రధాన రహదారికి సుమారు అరకిలో మీటరు దూరంలో ఉన్న గోండుగూడ గ్రామానికి వెళ్లేదారి సరిగ్గా లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. గతంలో పాలకవర్గాలు గ్రామ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గ్రామాల్లో రూపురేఖలు మారిపోయాయి. గత సంవత్సరం డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి రూ. 15లక్షలు మంజూరు కావడంతో అప్పటి ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌లు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తి కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

44
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles