తొలి రోజు ఒకే నామినేషన్

Mon,March 18, 2019 11:34 PM

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడగా మొదటి రోజు ఒక నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దివ్యకు ఆయన తమ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన నామినేషన్ వేశారు. సోమవారం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభంకాగా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణకు గానూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమయం ఉండడంతో ఉద్యోగులు మినహా ఇతరులను లోనికి అనుమతించలేదు.

31
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles