ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన

Mon,March 18, 2019 11:34 PM

రెబ్బెన: మండలంలోని కిష్టాపూర్, జ క్కులపల్లి, కొమురవెళ్లి గ్రామాల్లో సోమవారం ఆర్‌ఐ ఊర్మిళ ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఈవీఎం, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల తరహాలోనే త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సైతం ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. వీవీ ప్యాట్ యంత్రాల ద్వారా ఓటర్లు తాము ఏఅభ్యర్థి ఓటు వేశామో తెలుసుకునే వెసులుబాటు ఉందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ , వీఆర్వో రాజన్న పాల్గొన్నారు.
కౌటాల: మండలంలోని బోదంపల్లి గ్రామంలో సోమవారం తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యం లో ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరుకు వీటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు వసం త్, కారయ్య, ఆపరేటర్ నాగరాజు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles