ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

Mon,March 18, 2019 01:11 AM

పెంచికల్‌పేట్ : ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ బండి ప్రకాశ్ హెచ్చరించారు. ఎల్కపల్లి గ్రామ శివారులోని సర్వే నెం.177లోని సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమి ఉండగా, గతంలో ఈ భూమిలో పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ స్థానికులు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని ఫిర్యాదు మేరకు ఆదివారం ఆయన పరిశీలించి స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా మండలం ఏర్పడిందనీ, ఇక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆయా కార్యాలయాల నిర్మాణానికి ఉపయోగపడతాయన్నారు. త్వరలోనే డిజినల్ సర్వేయర్‌తో కొలతలు చేయించి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల అలసత్వం, రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే భూములు కబ్జాలకు గురువుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు, నాయకులు ప్రభుత్వ భూముల రక్షణకు సహకరించాలని కోరారు. స్థానికంగా విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారసంతకు భూమిని కేటాయించాలని గ్రామస్తులు కోరగా కృషిచేస్తానని హామీనిచ్చారు. వీరి వెంట ఆర్‌ఐ సంతోష్, ఎస్‌ఐ రమేశ్, వీఆర్వో వైకుంఠం, గ్రామస్తులు ఉన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles