అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక పోటీలు

Mon,March 18, 2019 01:10 AM

చింతలమానేపల్లి: మండల కేంద్రంలోని మైమదర్‌స్కూల్‌లో ఆదివారం అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. జిల్లా నుంచి ఆయా పాఠశాలల విద్యార్థులు పలు పాటలపై డ్యాన్స్ చేశారు. ముఖ్యఅతిథిగా కౌటాల జడ్పీటీసీ డుబ్బుల నానయ్య హాజరై మాట్లాడుతూ అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పోటీలతో విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపయోగపడతాయన్నారు. అనంతరం అంబేద్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జాడి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటు టీవీ ప్రోగ్రాంలలో పంపిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు డుబ్బుల వెంకన్న, సర్పంచ్ మేకల ప్రసాద్, ఎస్‌ఐ లచ్చన్న, మైమదర్ స్కూల్ కరెస్పాండెంట్ గోమాస తులసీరాం, ఫౌండేషన్ ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles