ఓటు విలువ తెలియజేయాలి

Sun,March 17, 2019 01:09 AM

-కలెక్టర్ భారతి హోళికేరి
-బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు అవగాహన
లక్షెట్టిపేట : ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత విలువైనదో ప్రజలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. చునావ్ పాఠశాలలో భాగంగా శనివారం లక్షెట్టిపేటలోని కళాంజలి ఫంక్షన్‌హాల్‌లో దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల బీఎల్‌వోలకు ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలన్నారు. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే నిజాయితీగా ఓటు వేయాలని చెప్పారు. ప్రలోభాలకు లొంగకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే బీఎల్‌ఓలు సక్రమంగా విధులు నిర్వహించేలా సూపర్‌వైజర్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత సీ-విజిల్ మొబైల్ యాప్ పనితీరుతో పాటు మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకునే వారి కోసం యానిమేటెడ్ ఓటింగ్ సిస్టమ్‌పై బీఎల్‌ఓలకు సవివరంగా అవగాహన కల్పించారు. సీ-విజిల్‌లో ఎన్నికల నిబంధనలు ఉల్లఘించినట్లు సంబంధిత లైవ్ ఫొటో, వీడియోలను అప్‌లోడ్ చేస్తే 100 నిమిషాల్లో ఉల్లంఘనులపై చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి బీఎల్‌ఓలను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయనీ, ఫిర్యాదుల కోసం ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1950కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. దండేపల్లి మండలానికి మూడు, లక్షెట్టిపేట మండలానికి రెండు వీఎస్‌డీయూ(వీవీప్యాట్ స్టేటస్ డిస్‌ప్లే యూనిట్)లను అందజేసి వాటి ఉపయోగం గురించి వివరించారు. కార్యక్రమంలో లక్షెట్టిపేట తహసీల్దార్ నర్సయ్య, దండేపల్లి తహసీల్దార్ కిరణ్మయి పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles