భవిష్యత్ మీదే షూటింగ్ ప్రారంభం

Sun,March 17, 2019 01:08 AM

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియా కమ్యూనికేషన్ సెల్ ఆద్వర్యంలో 2018-19 సంవత్సరానికి గానూ నిర్మిస్తున్న భవిష్యత్ మీదే అనే లఘు చిత్రం షూటింగ్‌ను శనివారం జీఎం కార్యాలయంలో జీఎం సుభానీ క్లాప్ కొట్టి ప్రారంభించారు. సింగరేణి కార్మికులైన కళాకారులచే ఈ లఘు చిత్రం నిర్మిస్తున్నట్లు డీవైజీఎం గోవిందరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీఎం కళాకారులనుద్దేశించి మాట్లాడుతూ ఎంతో ఉన్నత చదువులు చది వి తల్లిదండ్రుల ఉద్యోగాన్ని కారుణ్య నియామకంతో ఉద్యోగం పొందిన యువకులు సంస్థ మనుగడకై కృషి చేయాలని సూచిస్తూ లఘు చిత్రాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి ఏవిధంగా పాటు పడాలి, రక్షణ చర్యలు, సంస్థలో కార్మికులకున్న సౌకర్యాలు, భవిష్యత్ తదితర అంశాలపై లఘు చిత్రం నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు నటనలో ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటూజీఎం సత్యనారాయణ, డీవైజీఎం రాజేశ్వర్‌రెడ్డి, చిరంజీవి, ఎం శ్రీనివాస్, మేనేజర్ రాజెందర్, కమ్యూనికేషన్ సెల్ కార్యదర్శి తుకారాం, టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధి అశోక్, ఫిట్ కార్యదర్శి పీ వెంకటేశ్వర్‌రావు, పీఆర్‌ఏ సంపత్‌కుమార్, కళాకారులు వెంకటాస్వామి, దమ్మాల శ్రీనివాస్, గజ్జెల్ళి రాజలింగు, సతీష్ పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles