ప్రజా సంక్షేమానికే టీఆర్‌ఎస్‌లోకి..

Sun,March 17, 2019 01:08 AM

- ఎమ్మెల్యే ఆత్రం సక్కు
- ఝరిలో కార్యకర్తలలో సమావేశం
కెరమెరి : నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమే టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించామని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం మండలంలోని ఝరి గ్రామంలో మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీలో నెలకొన్న ఆదివాసీలు, గిరిజనేతరుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మన సమస్యలు నెరవేర్చేందుకు త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంచి లక్ష్యంతో రాష్ర్టాని అభివృద్ధివైపు నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీల వారీగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించగా అందరు ఎమ్మెల్యేకు అండగా నిలుస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండీ.మునీర్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ ఆత్రం లక్ష్మణ్‌రావ్, నాయకులు ఆత్రం కుసుంరావ్, కుమ్ర నానేశ్వర్, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles