దోషులకు శిక్ష పడేలా చూడాలి

Sun,March 17, 2019 01:07 AM

- ఎస్పీ మల్లారెడ్డి
- ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ట్రయల్ కేసులపై సమీక్ష
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: దోషులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ ఆధికారులు చూడాలని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. శనివారం ఏఆర్‌హెడ్ క్వార్టర్‌లోని సమావేశ మందిరంలో కోర్టులో పెండింగ్ ఉన్న ట్రయల్ కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా..? అని ఆడిగి తెలుసుకున్నారు. జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దాలంటే శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి కేసు పూర్తయ్యేవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు, సాక్షులు వాగ్మూలం కోర్టుకు సమర్పించాలన్నారు. కోర్టులో బాధితులకు న్యాయం జరిగేలా నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేయాలని , నేరస్తులకు వారెంట్స్, సమన్లు ,సత్వరమే ఎగ్జిక్యూటివ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు సమాచారం ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు తెలియజేయాలన్నారు. కోర్టు క్యాలెండర్ ఎప్పటికప్పుడు అప్డెట్ చేసి సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. కోర్టు పెండింగ్ ట్రయల్ కోర్టు మానిటర్ సిస్టమ్ లో డాటా ఎంటర్ చేయాలని సూచించారు. దీనీ ద్వారా ప్రతి రోజు కోర్టు ప్రాసెస్ ఎలా జరుగుతుందని ఆన్‌లైన్ వెంటనే తెలుసుకోవచ్చానీ, దీంతో కోర్టు కానిస్టేబుల్ పని సులభమతుందున్నారు. ప్రతి రోజు కోర్టులో ట్రయల్ జరిగిన కేసులు ఎంటర్ చేస్తే పెండింగ్ లేకుండా ఉంటుందన్నారు. సమావేశంలో కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles