చదువుతో ఉజ్వల భవిష్యత్

Sun,March 17, 2019 01:07 AM

- టీటీడబ్ల్యూ ఆర్‌జేసీ వార్షికోత్సవంలో డీఎస్పీ సాంబయ్య
కాగజ్‌నగర్ టౌన్ : చదువుతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య అన్నారు. శనివారం పట్టణంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గు రుకుల బాలికల అప్‌గ్రేడ్ (పాఠశాల) కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్‌గా దీటుగా సర్కారు బడుల్లోనూ సౌకర్యాలు ఉన్నాయనీ, తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ వనజారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. అంతకుముం దు డీఎస్పీ సాంబయ్య, తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీఎస్పీ సాంబయ్య, తహసీల్దార్ బహుమతులను అందజేశారు. అంతకుముందు తహసీల్దార్, ప్రిన్సిపాల్ అజ్మత్ సరస్వతీ దేవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఆర్‌సీవో జోసేష్‌జాన్, వార్డెన్ రుక్మిణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles