విజయీభవ

Sat,March 16, 2019 12:53 AM

- జిల్లాలో 37 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 7,467 మంది విద్యార్థులు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు


ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 7,467 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరి కోసం 37 కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 37 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 37 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌తో పాటు దాదాపు 330 మంది సిబ్బందిని నియమించారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందుగానే కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. ఉష్ణోగ్రతలు పెరడగంతో తాగునీరు, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో రెగ్యూలర్ 6342, ప్రైవేట్ 1125మంది విద్యార్థులున్నారు. రెగ్యూలర్ విద్యార్థులకు 31 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు ఆరు కేంద్రాలు కేటాయించారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

రెగ్యులర్ విద్యార్థులకు కేటాయించిన పరీక్షా కేంద్రాలు
అశ్రమ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల జైనూర్, ఆశ్రమ పాఠశాల బాలుర మహాగావ్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల మోడి, జిల్లా పరిషత్ పాఠశాల కెరమెరి, తిర్యాణి, రెబ్బెన, జన్కాపూర్, వాంకిడి, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆసిఫాబాద్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆసిఫాబాద్, టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ (బాలిక) ఆసిఫాబాద్, ఆశ్రమ పాఠశాల వాంకిడి, ప్రభుత్వ జూనియర్ కళాశాల కాగజ్‌నగర్, బాలభారతి హైస్కూల్ కాగజ్‌నగర్, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల కాగజ్‌నగర్, ఎస్‌ఎం హెచ్‌ఎస్ కాగజ్‌నగర్, జిల్లా పరిషత్ బాలుర పాఠశాల కాగజ్‌నగర్, ప్రభుత్వ హైస్కూల్ ఇస్‌గాం నంబర్ -5, ప్రభుత్వ పాఠశాల ఇస్‌గాం నంబర్-3, టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలుర సిర్పూర్(టి), జిల్లా పరిషత్ పాఠశాల సిర్పూర్(టి), జిల్లా పరిషత్ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బాగాంధీ పాఠశాల కౌటాల, హైస్కూల్, కస్తూర్బాగాంధీ పాఠశాల దాహెగాం, జిల్లా పరిషత్ పాఠశాల బెజ్జుర్, గంగాపూర్, రెబ్బెన, పెంచికల్‌పేట్, కస్తూర్బా పాఠశాల బెజ్జుర్.

ప్రైవేట్ విద్యార్థుల కోసం ఆరుపరీక్షా కేంద్రాలు
తెలంగాణ ఆదర్శ పాఠశాల ఆసిఫాబాద్, బాలికల ఆశ్రమ పాఠశాల ఆసిఫాబాద్, ఫాతీమ కాన్వేంట్ హై స్కూల్ సెంటర్-ఎ ,సెంటర్ బీ కాగజ్‌నగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఓల్డ్ కాగజ్‌నగర్, టీఎస్‌ఎస్‌డబ్ల్యూ ఆర్‌ఎస్ (బాలికల) పాఠశాల సిర్పూర్(టి).

46
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles