వెండితెరపై వీరుడి చరిత్ర

Sat,March 16, 2019 12:52 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జోడేఘాట్ అడవుల్లో తుడుం మో గించిన.. ఆదివాసుల ఉద్యమ వీరుడు.. కు మ్రం భీం చరిత్ర భారీ స్థాయిలో దృశ్యరూపకంగా రాబోతున్నది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, మన ఆదివాసీ ధీరుడు కు మ్రం జీవిత గాథలతో అగ్రదర్శకుడు రాజమౌ ళి ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మేర కు ఆయన తాజాగా ఓ ప్రకటన చేయడంతో. జిల్లావ్యాప్తంగా చర్చ మొదలైంది. పోరాట గడ్డ జోడేఘాట్ ఉద్యమం ఇక విశ్వవ్యాప్తం కాబోతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

కథ.. స్క్రీనిప్లే.. దర్శకత్వం.. తారాగణం
చరిత్రాత్మక ఘటనలతో, భారీ బడ్జెట్‌తో అనేక చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజమౌళి, అదే తరహాలో ఆదివాసుల పోరాట యోధుడు కుమ్రం భీం, మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జీవిత గాథలను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అప్పటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా సహజత్వంగా రూ. 400 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. అగ్ర నాయకులు ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నిర్మితమవుతున్న ఈ చిత్రంతో మన వీరుడి చరిత్రకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రానుంది. తమ యోధుడి చరిత్రను సినిమా రూపకంగా తీయబోతున్నరని తెలిసి ఆదివాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జోడేఘాట్‌కు వచ్చే అవకాశం..!
తన చిత్రాల్లో సహజత్వానికి పెద్ద పీఠ వేసే అగ్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్(వర్కింగ్ టైటిల్) చిత్రంలో కూడా సహజత్వానికి పెద్ద పీట వేస్తున్నారు. దీంతో కుమ్రం భీం చరిత్రను నడిపించేందుకు జోడేఘాట్‌కు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. జోడేఘాట్ అడవులు, ఇక్కడి ప్రాంతాలతోపాటు కుమ్రం భీం పోరాటం స్ఫూర్తి కల్పించిన 12 గ్రామాల సహజత్వాన్ని, ఆదివాసీల జీవన విధానాన్ని చూసేందుకు, చిత్రంలో చూపించేందుకు చిత్రం బృందం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్ రాకతో దేశవ్యాప్త చర్చ..
దశాబ్ధాల కాలంగా మరుగునపడిపోయిన కుమ్రం భీం చరిత్రను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులోకి తెచ్చారు. సాధారణ నాయకులు కూడా రావాలంటేనే భయపడే జోడేఘాట్‌కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కేసీఆర్ అడుగు పెట్టారు. కోట్లాది రూపాయలతో స్మారక చిహ్నం, గిరిజన మ్యూజియం, స్మృతి వనాన్ని నిర్మించి దేశ వ్యాప్తంగా కుమ్రం భీమ్ చరిత్రపై చర్చ మొదలయ్యేలా చేశారు. భీం వారసులకు అండగా ఉండడంతో పాటు ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తెచ్చే చర్యలు తీసుకున్నారు.

గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఓ చిత్రం..
కుమ్రం భీం చేసిన పోరాటం, జీవిత చరిత్రపై 1994లోనే ఐటీడీఏ ఓ చిత్రాన్ని నిర్మించింది. కుమ్రం భీం చరిత్రను భావితరాలకు అందించేందుకు ఐటీడీఏ నిధులతో నిర్మించిన ఈ చిత్రానికి నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత డైరెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఒక షార్ట్ ఫిలిం, ఒక ధారావాహికను కూడా నిర్మించారు. మరోసారి వెండి తెరపైకి రాబోతుండడంతో, సర్వత్రా చర్చనీయాంశమైంది.

అజ్ఞాతకాలంపైనే అసలు చర్చ..
జోడేఘాట్‌లో కుమ్రం భీం పోరాటం ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆ కాలంలో పంటను దోచుకునేందుకు వచ్చిన సిద్ధికి అనే జాగిర్దార్‌ని చంపిన కుమ్రం భీం మహారాష్ట్రలోని చందా, అస్సాం ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నాడు. కొన్నేళ్ల తరువాత మళ్లీ జోడేఘాట్ ప్రాంతానికి తిరిగి వచ్చాడు.. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కుమ్రం భీం ఏం చేశారనేది ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు దర్శకుడు ప్రకటించారు. దీంతో కుమ్రం భీం గడ్డగా ఈ ప్రాంతవాసుల్లో మరింత చర్చ ప్రారంభమైంది.

49
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles