టెన్‌షన్ వద్దు

Fri,March 15, 2019 01:21 AM

-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో డీఈవో భిక్షపతి
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతి వి ద్యార్థి జీవితంలో పదో తరగతి చాలా కీల కం.. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారంతా పేదింటివారే. వారికి చక్కటి భవిష్యత్ ఇచ్చే బాధ్యత విద్యాశాఖలో ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అంతకు మించి జిల్లా విద్యాశాఖాధికారిగా నాపై చాలా బాధ్య త ఉంది. రాష్ట్ర వ్యా ప్తంగా 16న పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. పక్కా ప్రణాళికతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశాం. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించి తీరుతాం. పదో తరగతి పరీక్షలపై డీఈవో భిక్షపతి వెల్లడించిన విషయాలివి.. ఆయన ఇంకా నమస్తే తెలంగాణతో పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సంసిద్ధతపై పలు అంశాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే..
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అమలు చేసిన ప్రణాళికలు ఏంటి..?
డీఈవో: విద్యార్థులకు పాఠ్యాంశాల్లోని సిలబస్‌ను త్వరితగతిన పూర్తి చేశాం. అవసరమైన చోట్ల ప్రత్యేక సిబ్బందిని నియమించి విద్యార్థులకు అన్ని నైపుణ్యాలను అందిం చాం. సమ్మేటివ్ పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో ఈ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం.
ప్రత్యేక క్యాంపు ప్రయోజనాలు ఏ మేరకు ఉండొచ్చు..?
జిల్లాలోని ప్రతి మండలంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించాం. నెల పాటు విద్యార్థులకు వసతి, భోజనం చదువు ఇలా అక్కడే క ల్పించాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలు అమలు పరిచాం. కచ్చితంగా సఫలమవుతాం.
పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు..?
జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాం. వీటిలో 31 రెగ్యూలర్, 6 ప్రయివేటు కేంద్రాలున్నాయి. ఇప్పటికే వి ద్యాశాఖ అధికారులు తనిఖీ చేశారు.
ఎంత మంది విద్యార్థులు హాజరవుతున్నారు..?
రెగ్యూలర్‌లో 6342, ప్రైవేట్‌లో 1125 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరి కోసం 37 జోన్లను ఏర్పాటు చేశాం.
పర్యవేక్షణ ఎలా ఉండబోతుంది..?
పరీక్షలను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్, జేసీలతో పాటు నేను, మిగితా సహాయ బృంద సభ్యులు పక్కా ప్లాన్‌తో వెళ్తున్నాం. ప్రశాంతంగా పరీక్షలను పూర్తి చేసేందుకు వా రందరూ పర్యవేక్షిస్తున్నారు. 74 మంది సి ట్టింగ్ స్కాడ్, ముగ్గురు ఫ్లయింగ్ స్కాడ్‌ల ను ఏర్పాటు చేసి పరీక్షల్లో ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం.
వేసవి దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా తీసుకున్న చర్యలు..?
ఎండ వేడిమిని తట్టుకునేలా అన్ని కేంద్రాలను ఏర్పాటు చేశాం. కింద కూర్చుని పరీక్ష లు రాసే విధానానికి స్వస్థి చెప్పాం. అంతే కా క చీకటి గదులు లేకుండా చూశాం. అన్ని గ దుల్లో లైట్లు ఉండేలా చూశాం. ప్రతి కేంద్రం లో తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. వైద్యశాఖ సహకారంతో మెడికల్ కిట్‌లతో పాటు ఒక ఏఎన్‌ఎం ఉం డేలా చర్యలు తీసుకున్నాం. ఓఆర్‌ఎస్ ప్యాకె ట్లు అందుబాటులో ఉంచుతాం.
ఇన్విజలేటర్లకు మీరిచ్చే సలహాలు.. సూచనలు..? ఉన్నతాధికారుల ఆదేశాలు ఏంటి..?
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. పరీక్షా పత్రాలను పోలీస్ బందోబస్తు ద్వారానే కేంద్రాలకు తరలిస్తాం. కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు సెల్ వాడరాదని ఆదేశాలు జారీ చేశాం. చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్‌మెంటల్ అధికారులు కూడా సాధారణ ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశాం. నెట్ కనెక్షన్ లేని ఫో ను మాత్రమే సీఎస్‌లు వాడాలని సూచిం చాం. నిబంధనలకు విరుద్దంగా ఏ ఒక్కరూ ప్రవర్తించినా శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. పత్రి ఒక్కరూ గుర్తింపు కార్డుతో విధులకు హాజరుకావాలని తెలిపాం.
విద్యార్థులకు మీరిచ్చే సలహాలు.. ఏ విధంగా వారిని సన్నద్ధం చేశారు...?
మొదట విద్యార్థులకు అల్‌ది బెస్ట్. ఎ లాంటి వదంతులను నమ్మవద్దు. ఇష్టపడి చదివితే త ప్పకుండా ఫలితం వస్తుంది. ప్రశాంతమైన మనస్సుతో విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాలి. టెన్షన్‌కు గురికావద్దు. ఉన్నతాధికారులు ఏ సమయంలోనైనా పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించే అవకాశం ఉంది.
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మీరు చేపట్టిన ప్రణాళిక ఏంటి..?
ఈ ఏడాది జిల్లాను అగ్రస్థానంలో నిలపాలనేది ఆశయం. జిల్లాలో అనేక మంది ఏ గ్రేడ్ సాధించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాం. దీంతో పాటు ఫ్రీ ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించాం. సాయంకాలం అన్ని పాఠశాలలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాం.
పరీక్షా కేంద్రంలోకి అనుమతించే వస్తువులేమిటి..?
విద్యార్థులు హాల్‌టిక్కెట్ ,పెన్నులు, పరీక్ష ప్యాడ్,జ్యామెట్రిక్ బాక్స్‌తో కేంద్రంలోకి రావాలి. వేరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవీ అనుమతించం. హాల్ టిక్కెట్లు విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకుని గెజిటెట్ అధికారులతో ధ్రువీకరించుకొని హాజరుకావాలి.
ఏ సమయానికి కేంద్రానికి చేరుకోవాలి..?
పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.15 గంటల వరకు నిర్వహిస్తాం. ముందస్తుగా అడ్రస్ తెలుసుకుంటే ఉత్తమం. విద్యార్థులు ముందుగానే చేరుకుని ప్రశాంతంగా రాయాలని కోరుకుంటున్నాం.
యూనిఫాం అనుమతిస్తారా..?
విద్యార్థులు ఆయా పాఠశాలలకు చెందిన స్కూల్ డ్రెస్( యునిఫాం) వేసుకుంటే పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేశాం. సివిల్ డ్రెస్‌లోనే పరీక్షలకు హాజరుకావాలి.
హాల్‌టిక్కెట్ల విషయంలో జాగ్రత్తలు..?
ప్రైవేటు ఫాఠశాలలు ఫీజులు చెల్లించలేదని పరీక్షా సమయంలో హాల్ టెకెట్లు ఇవ్వకుం డా ఆందోళనకు గురిచేస్తాయి. విద్యార్థులు అందోళన చెందకుండా ఉండేలా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉన్న హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షకు హాజరయితే అనుమతిస్తా రు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై గెజిటెడ్ సంతకం ఉంటే సరిపోతుంది.
ఇన్విజిలేటర్ల బాధ్యతలు ఎలా..?
ప్రతి తరగతి గదిలో ఇన్విజిలేటర్ నుంచి స్వీయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్నాం. తమకు సంబంధించిన వారు ఎవరూ పరీక్షా కేంద్రంలో లేరని సమూనాలో తీసుకుం టాం. ఎవరైన విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే వారినే బాధ్యులను చేస్తాం.

43
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles