పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించండి

Fri,March 15, 2019 01:20 AM

సిర్పూర్(యు)/ జైనూర్: పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని జిల్లా విద్యాధికారి భిక్షపతి సూచించారు. సిర్పూర్ మండలం మహగాం ఆశ్రమ పాఠశాలలో పరీక్షా కేంద్రం, జైనూర్‌లోని విద్యా వనరుల కేంద్రాన్ని గురువా రం పరిశీలించారు. అనంతరం కేజీబీవీ, జిల్లా పరిషత్ పాఠశాలలను తనిఖీ చేశారు. కేంద్రంలో తా గు నీరు, విద్యుత్, ఫ్యాన్లు ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఎంఈవో కుడ్మెత సుధాకర్‌కు సూచించారు. ప్రతి రోజూ పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రత్యేక తరగతుల ద్వారా ము ఖ్యమైన విద్యాబోధన చేయాలన్నారు. విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలన్నారు. ఎలాం టి ఒత్తిడికి లోనుకాకుండా పిల్లల్లో మనోధైర్యం నింపాలన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వి ద్యార్థుల కోసం ప్రత్యేక వాహన సౌకర్యం ఏర్పా టు చేయాలన్నారు. అంతకు ముందు విద్యార్థుల తో మాట్లాడారు. విద్యాబోధన సక్రమంగ జరిగిం దా, సమస్యలున్నాయా అనే విషయాలడిగి తెలుసుకున్నారు. భయం పెట్టుకోవడం వలన వచ్చిన సమాధానాలు కూడా మరిచిపోయే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షల నిర్వహణ అధికారి ఉదయభాను, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

సమయ పాలన పాటించాలి
సిర్పూర్(యు): పాఠశాలల్లో ఉపాధ్యాయు లు సమయ పాలన పాటించాలనే బయో మెట్రి క్ విధానాన్ని ప్రవేశపెట్టామని జిల్లా విద్యాధికా రి భిక్షపతి అన్నారు. మండల కేంద్రంలోని ఆద ర్శ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా బయో మెట్రిక్ విధానం అమ లు చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు సమయాన్ని నమో దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నిర్వహిం చే ఎస్‌ఏ-2 పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలన్నారు. మధ్యా హ్న భోజనంలో నిర్లక్ష్యం వహించద్దనీ, శుక్రవా రం నుంచి ఒంటిపూట బడులు ఉండడంతో పిల్ల లపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారిని ఎండ లో తిరగకుండా సూచనలివ్వాలన్నారు. ఎంఈవో కుడ్మెత సుధాకర్, ప్రధానోపాధ్యాయులున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles