భూమిపై అవగాహన కలిగి ఉండాలి

Fri,March 15, 2019 01:20 AM

రెబ్బెన: కూరగాయలు, పప్పు దినుసులు సాగు చేసే భూములపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆత్మ జిల్లా బీటీఎం గురుమూర్తి సూచించారు. మండలంలోని గంగాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ, ఆత్మ సౌజన్యంతో పప్పు ధాన్యాల పంటలను పెంచుతూ భూమి ఆరోగ్యం కాపాడడం, కురగాయాల నారుమడిపై క్షేత్ర పర్యటన నిర్వహించారు. గంగాపూర్‌కు చెందిన రైతు కొట్రంగి ముత్తాబాయి చేనులో కురగాయల సాగుపై, వడై పోచయ్య చేనులో పప్పు ధాన్యాలు పండించడంతో కలిగే లాభాల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ కురగాయాలు పండిం చే సమయంలో తగిన సలహాలు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుందన్నారు. పప్పుధాన్యాలు పం డించడం వల్ల భూమి సారవంతమవుతుందని పే ర్కొన్నారు. పప్పుధాన్యాలకు సంబంధించిన పం టలు పండించడం వల్ల భూమి ఆరోగ్యం కాపాడి న వారవతామన్నారు. రైతులు వాటికి సంబంధించిన అన్ని సలహాలు పాటించాలని సూచించారు. ఏటీఎం సంజీవ్, ఏఈవో రాకేశ్, సుకన్య, రైతులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles