యువతే కీలకం

Fri,March 15, 2019 01:19 AM

-జిల్లాలో రెండు లక్షలకు పైగా ఓటర్లు వారే..
-లోకసభ ఎన్నికల్లోనూ అన్ని పార్టీల దృష్టి వీరి పైనే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పార్లమెంట్ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ ని యోజకవర్గాల పరిధిలో 4,01, 106 మంది ఓటర్లు ఉండగా వీరిలో 18 నుంచి 39 ఏళ్ల వయస్సు కలిగిన యువత ఓటర్లు 2 లక్ష ల20 వేల 739 ఉన్నాయి. దీంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పక్షాన నిలిచిన యువ ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో ఇప్పటికే అధికార పార్టీ ప్రచారానికి సమాయత్తం అవుతోంది.
పెరిగిన కొత్త ఓటర్లు..
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఓటు హక్కు పొందారు. ఈ నాలుగు నెలల కాలంలోనే జిల్లాలో 23 వేల పైచిలుకు ఓట్లు పెరిగాయి. ఇప్పటికే గ్రామాల్లో యువత ఎక్కువగా టీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామ గ్రామ యువజన సంఘాలతో టీఆర్ ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇటీవల జరిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ జిల్లాలో 250 గ్రామ పంచాయతీల్లో ఘనవిజయం సాధించింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూ డా అదే జోరు కొనసాగనుంది. జిల్లాలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 9438 మంది ఉండగా 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న ఓటర్లు 1 లక్ష 9 వేల 37 మంది, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఓటర్లు 1 లక్ష 2 వేల 264 మంది ఉన్నారు. 40 నుంచి 80 ఏళ్లపై వయస్సు ఉన్న ఓటర్లు 1 లక్ష 80 వేల 367 మంది ఉన్నారు...
గ్రామాల్లో గులాబీ సైన్యం..
గ్రామాల్లో గులాబీ పార్టీకి ప్రత్యేకంగా యువతలో మంచి పట్టు ఉంది. టీఆర్‌ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ, గ్రామంలోను ప్రత్యేక కమిటీలు ఉన్నాయి. వీరే టీఆర్‌ఎస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామ గ్రామన కమిటీలు ఉండడంతో పార్టీ పరమైన కార్యక్రమాలతోపాటు ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాల్లో యువతే ప్రధానంగా పాల్గొంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించడంలో వీరే కీలకం కాబోతున్నారు.
ఆకట్టుకునే పథకాలు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యో గ అవకాశాలు కల్పిస్తోంది. ఆకట్టుకునేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. సీఎంగా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడంతో యువకులకు రూ. 3,116 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటుండడంతో, యువత పార్టీకి మరింత ఆకర్షితులవుతున్నా రు. దీంతోపాటు అనేక ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోంది. ఎటువంటి షురిటీలు లేకుండా రూ. 50 వేల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తున్నారు. చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నవారికి ఆసక్తి కలిగిన రంగాల్లో ఉచితంగా శిక్షణలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీంతో గులాబీ పార్టీకి యువత అండగా ఉంటూ, గెలిపించుకునేందుకు వారే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. స్వయం ఉపాధి కోసం ఆటోలు, కిరాణ దుకాణాలు, డ్రైవర్ కం ఓనర్ పథకం ద్వారా కార్లు, ఇవ్వడంతో పాటు ఇతర అనేక పథకాల్లోనూ యువతను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా ఉన్న యువ ఓటర్లు టీఆర్‌ఎస్ పార్టీవైపు మొగ్గుచూపడానికి పథకాలే ప్రధాన కారణమవుతున్నాయి.

45
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles