వార్ వన్ సైడే..

Thu,March 14, 2019 12:46 AM

- గులాబీ గెలుపు ఖాయం.. మెజార్టీయే లక్ష్యం..
- తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొడుతున్న జనం
- పోటీకి జంకుతున్న కాంగ్రెస్ నేతలు
- ఉనికిలోలేని టీడీపీ, బీజేపీ, వామపక్షాలు


కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైం ది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా టీఆర్‌ఎస్ పార్టీ స న్నాహక సమావేశాల పేరిట ముందస్తు ప్రచారం ప్రారంభించింది. వీటికి ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు హాజరై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్ధేశం చేస్తున్నా రు. దీనిద్వారా ప్రచారంలో ముందున్నామని ప్ర తిపక్షాలకు సంకేతాలు ఇచ్చారు. పార్లమెంట్ సమరంలో ఆదిలాబాద్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి దిమ్మదిరిగే కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నా రు. అభ్యర్థి ఖరారైన వెంటనే ఎన్నికల కదనరంగంలోకి పూర్తిస్థాయిలో దూకడానికి కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. పార్టీలోని ప్రథమ శ్రేణి నాయకత్వం నుంచి కిందిస్థాయి నాయకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి విజయతీరాల వైపు నడిపించేందుకు వ్యూహ రచన మొదలైంది. ఆదిలా బాద్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలుపించుకోవడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలో మొదటి విడతనే ఎన్నికలు నిర్వహిస్తుండడంతో.. ఇంకా 28 రోజుల సమయం మా త్రమే మిగిలి ఉంది. ఈ టైంను సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రచార ఏర్పాట్లు, సభలు, సమావేశాలు నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ నెల 14న తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉండగా.. వాయిదా పడింది. 17న తేదీన ముఖ్యమంత్రి కరీంనగర్‌లో నిర్వహించనున్న సభపైన దృష్టి సారించారు.

జిల్లాలో గులాబీ దూకుడు..
పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ తన దూకుడు పెంచింది. ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయ ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ రెండు, మూడు రోజుల్లో ప్రకటించేందుకు సిద్ధం గా ఉంది. అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులను సిద్ధం చేయడంతోపాటు దిశానిర్దేశం చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఆసిఫాబాద్, సిర్పూర్‌నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. అంతేకాకుండా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా చర్యలు చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌వైపే నిలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతుల పరంగా పెట్టుబడి సాయం, రైతుబీమా, సబ్సిడీపై యంత్రాలు అందిస్తుండటంతో రైతులు టీఆర్‌ఎస్ పార్టీకే జై కొట్టే అవకాశం ఉంది. అదేవిధంగా పింఛన్‌దారులు కూడా పూర్తిస్థాయిలో గులాబీ పార్టీకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ రెండు వర్గాలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు వేయడంతో అఖండ మెజార్టీ వచ్చింది. వీటికితోడు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.1,00,116 ఆర్థిక సాయం అందించడం, భూమిలేని నిరుపేద మహిళలకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ చేయడం, పేదవారికి కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా రూపాయి కిలో బియ్యం పంపిణీ చేయడం ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. దీంతో సబ్బండ వర్ణాలు ప్రజలు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, గులాబీ సేనకు త మ మద్దతు ప్రకటించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పోటీ నామమాత్రమే..
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రమే కానుంది. అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి జై కొడుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఉనికి కాపాడుకోవడం కోసమే పోటీ చేయనుంది. ఆ పార్టీ ఇప్పటికి పేర్లు ప్రకటించలేదు. ఇక్కడ పోటీ చేసేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు రావడం లేదని, భయపడుతున్నారని సమాచారం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో టీఆర్‌ఎస్‌కు ఎదురువెళ్లి ఓటమి మూటగట్టుకోవడం కంటే పోటీ చేయకుండా ఉండటం ఉత్తమం అని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ నుంచి బరిలో దిగేందుకు నేతలు ఎవరూ ముందుకు రాని పక్షంలో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక మిగతా పార్టీల పరిస్థితి దారుణంగా ఉంది. టీడీపీ, బీజేపీ పార్టీలకు కనీసం కేడర్ కూడా లేదు. అదే సమయంలో వామపక్షాల పాత్ర కూడా నామమాత్రమే. మరోవైపు గత ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి కూటమి కట్టినా కనీసం డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పికొట్టారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురు అవుతుందని పార్టీ నేతలు భయపడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఆయా పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు. కేవలం టీఆర్‌ఎస్ పార్టీకే పట్టం కట్టారు. ఇపుడు ఎన్నికల్లో కూడా అదే గతి పడుతుందని మిగతా పార్టీల నేతలు గప్‌చుప్‌గా ఉన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles