సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Thu,March 14, 2019 12:45 AM

ఆదిలాబాద్ టౌన్: ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే చట్టసభల్లో పట్టభద్రుల సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆయన ప్రచారంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చారు. టీఎన్‌జీవోస్ భవన్‌లో రిటైర్డ్ ఉద్యోగులు, పట్టభద్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ సంఘం నాయకుడిగా నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై తన కు పూర్తిగా అవగాహన ఉందన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే పట్టభద్రుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజకీయ నాయకులకు పునరావాస వేదిక కారాదని సూచించారు. కార్యక్రమం లో టీఎన్‌జీవోస్ మాజీ ప్రధాన కార్యదర్శి హమీ ద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే లకా్ష్మరెడ్డి, ప్రధాన కార్యదర్శి పడకంటి కిష్ట య్య, రిటైర్డ్ ఉద్యోగులు, పట్టభద్రులు పాల్గొన్నారు.

నిర్మల్‌టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ తనను గెలిపించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి మామిళ్ల చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. బుధవారం నిర్మల్‌లోని టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకు అన్ని సంఘాల వారు మద్దతు తెలుపుతున్నారని వివరించారు. ముఖ్యం గా రాష్ట్ర ప్రభుత్వం బయట నుంచి తనకు మద్దతు ఇస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదాలతో ఎమ్మెల్సీ బరిలో నిలిచినట్లు చెప్పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు అండగా నిలుస్తానని తెలిపారు. గ్రూపు- 1 ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాలకతీతంగా ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాని తాము సమస్యలను పరిష్కరించే గొంతుకగా నిలుస్తామని అన్నారు. అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలపై సరైన అవగాహనతో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవో అధ్యక్షుడు ప్రభాకర్, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు అఖిలేష్‌కుమార్‌సింగ్, డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంసీ లిం గన్న, సుభాష్‌రావు, రమణగౌడ్ పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles