పంచాయతీల ఆదాయం పెంచాలి

Sat,February 23, 2019 01:50 AM

దహెగాం: గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కుటుంబరావు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా ర్చిలోగా ఇంటి పన్ను, ఇతర పన్నులను వందశాతం వ సూలు చేయాలని సూచించారు. ఎవరైన నూతనంగా ఇం డ్లు, ఇతర కట్టడాలు చేపడితే అనుమతి ఇవ్వడానికి నూ తన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం రుసుంను వసూ లు చేయాలన్నారు. అదేవిధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని సూచించారు. హరితహారం నర్సరీల పెంపకంలో చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారంలోగా అన్ని గ్రామాల్లో ఈజీఎస్ పనులు ప్రారంభించి కూలీలకు పనులు కల్పించాలని సూచించా రు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో చంద్రయ్య, సర్పంచులు, కార్యదర్శులు ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles