మైసమ్మ జాతరకు వేళాయె..!

Thu,February 21, 2019 11:54 PM

మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: చారిత్రక నేపథ్యమున్న గాంధారి ఖిల్లా మైస మ్మ జాతరకు వేళయ్యింది. ప్రకృతి అందాల నడుమ కొలు వై మహిమల గల తల్లిగా, వందల ఏండ్లుగా నా యక్‌పోడ్ గిరిజనుల ఆరాధ్యదైవంగా మారిన మైసమ్మ నేటి నుంచి పూజలందుకోనుంది. అమ్మదర్శనం కోసం వేలాది గిరిజన కుటుంబాలు పెద్ద ఎత్తున తరలిరానుండగా, మూడు రో జుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి. జాతరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మ హారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి నాయక్ పోడ్ లు తరలిరానుండగా, కలెక్టర్ ఆదేశాలతో ఐటీడీఏ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు..
దట్టమైన అటవీ ప్రాంతంలో గుట్టను తొలిచి నిర్మించిన గాం ధారి ఖిల్లా ఒక అద్భుత కట్టడం. గాంధారి ఖిల్లా పురాతమైన చా రిత్రాత్మక కట్టడం. జిల్లాకేంద్రం నుంచి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. కోటలోని శిల్ప సంపద చూపరులను కట్టిపడేస్తుం ది. రాతి ద్వారాలు, దేవాలయాలు, సొరంగ మా ర్గాలు, సవతుల బావులు ఇలా ఎన్నో ప్ర త్యేకలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలకు నిలువుటద్దం ఈ ఖిల్లా.

ఎన్నో గాథలు..
ఖిల్లాకు సంబంధించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయ సామంతరాజులైన గోండురాజులు దీనిని నిర్మించినట్లు చెబతారు. ఆర్కియాలజీ విభాగం చెబుతున్న దాని ప్రకారం క్రీశ 1200లో రాష్ట్రకూటుల కాలం లో నిర్మాణం ప్రారంభమై 16వ శతాబ్దంలో పూర్తయ్యింది. చరిత్రకారుల కథనం ప్రకారం.. అక్క డ శిల్పకళ తదితర అంశాలను పరిశీలిస్తే కచ్చితంగా అది కాకతీయుల పద్ధతిలో కట్టినట్లుగా ఉందని చెబుతున్నారు. కాకతీయులు శివున్ని పూజించేవారు. ఇ క్కడ వొద్దిరాజు, అనంతరాజు శాసనం ఉంటుం ది. వాస్తవానికి ఇది గోండురాజుల రాజ్యం తర్వా త ఒద్దిరాజు అనంతరాజు దీనిని అక్రమించినట్లు గా తెలుస్తోంది. స్థానికులు మాత్రం కాకతీయుల నుంచి రక్షణ కోసం వొద్దిరాజు లు, రెడ్డిరాజులు, గోండురాజులు నిర్మించుకున్నట్లు చెబుతారు.

కాకతీయు సామంతులు..
గాంధారి ఖిల్లా పేరు ఎలా వచ్చింది అన్న దా నిపై ఎన్నో ప్రచారాలున్నాయి. ఈ ప్రదేశానికి పాండవులు, కౌరవులకు సంబంధం ఉందని చె బుతారు. దుర్యోధనుడు కొద్దిరోజులు ఇక్కడ ఉ న్నాడని తన తల్లి పేరున కట్టించిన ఈ ఖిల్లాను గాంధారి ఖిల్లాగా పిలుచుకుంటారంటారు. అయి తే, ఇవేవీ నిజం కావని చరిత్రకారుల అభిప్రా యం. ఇక్కడ పాలించిన గోండురాజు లు కాకతీయుల సామంతులు కావడంతో కాకతీయరాజు, గోండు వంశస్థుల వారికి పుట్టిన ఆడబిడ్డే గాంధారిగా నామకరణం చేశారని చెబుతారు. కాకతీయు ల కాలంలో మహిళలకు పెద్దపీట వేసిన సంప్రదా యం ఉంది. ఈ నేపథ్యంలోనే గాం ధారి రాణీవా సం చేసి ఇక్కడ పరిపాలన చేసిందని ఆమె పేరిట గాంధారి ఖిల్లాగా పిలుస్తారనే చరిత్రకారుల నమ్మకం. ఇలా ఒక్కో చరిత్ర ఉన్నా నిజానికి గోం డురాజుల పాలనలో ఇక్కడ ప్రజలు ఎంతో సుఖసంతోషాలతో ఉండేవారని చెబతారు.

అబ్బురపరిచే కళా నైపుణ్యం..
ఖిల్లాలో రెండు దర్వాజాలు, దేవాలయా లు, సొరంగ మా ర్గం ఉన్నాయి. ద్వారాలు, దే వాలయాలు, రాళ్లపై చెక్కిన శిల్పాలు అలనాటి కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. వాటిపై చిత్రాలు అబ్బురపరుస్తాయి. ఖిల్లాపై ఉన్న శిల్ప సంపద చూ స్తే ఆశ్చర్యపోవాల్సిందే. కోటపైన బొగగుళ్లు, గాంధారి మైస మ్మ, కాలభైరవుడు, శివుడు, విఘ్నేశ్వరుడు, ఆంజనేయుడు తదితర దేవతా ప్రతిమ లు ఉన్నాయి. గుట్టపై ఖిల్లాకు వెళ్లేందుకు మెట్లున్నాయి. అవి ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశే షం. కొండపైన బండారాయితో తొలచిన మూడు ప్రధాన ద్వారాలున్నాయి. శత్రువుల రాకను పసిగట్టేందుకు నగారా గుండు(రక్షణ దుర్గం) నిర్మించారు. ఖిల్లాపైకి ఏనుగులు, గు ర్రాలు వెళ్లేందుకు అనువుగా చేసిన మార్గ నిర్మాణం కనిపిస్తుం ది. కొండపై భాగంలో బండను తొలచి చేసిన నాగశేషుని ఆల యం ఉంది. ఇందులో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తు పన్నెండు పడగల ఏకశిల నాగశేషుని విగ్రహం ఉంది. కొం డకు వొద్ది రాజుల శిలాశాసనం కన్పిస్తుంది.

కళకళలాడే బావులు..
గుట్టపై ఉన్న బావులకు సవతుల బావులు గా పిలుస్తారు. అన్ని కాలాల్లోనూ నీటితో కళకళలాడుతుంటాయి. వీటిలో ఏ నుగులు కూడా దాహం తీర్చుకునేవి అని చెబుతారు. వీటి దిగువన ఒక నీటి మడుగు, ఒక పెద్ద ఊర చెరువు ఉన్నాయి. వీటి కింద వందలాది ఎకరాలు సా గయ్యేవంట. ఈ ఖిల్లాలో ఉన్న మైసమ్మను చు ట్టుపక్కల ప్రాం తాలకు చెందిన ప్రజలే కాకుండా, ఇక్కడకు పెద్ద ఎత్తున జనం వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఏటా జాతరలో భాగంగా దున్నపోతును బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా నాయక్‌పోడ్ వంశీయులు ఘనంగా పూజలు నిర్వహిస్తారు.

తొలి రోజు సదర్ల భీమన్నకు పూజలు
రామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొ క్కలగుట్టలోని గాంధారిఖిల్లాలో మూడు రోజుల పాటు జరిగే మైసమ్మ జాతర కోసం అన్ని ఏర్పా ట్లు చేశారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివాసీ నాయక్‌పోడ్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 22న బొక్కలగుట్ట సమీపంలోని నల్లపోచమ్మకు పూజలు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. మొదట సదర్ల భీమన్న ఆలయం వద్ద ఆదివాసీ నాయక్‌పోడ్ సంప్రదాయంలో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవ తా గజాల(కర్ర విగ్రహాల)ను పవిత్ర గోదావరికి తీసుకెళ్లి స్నానాలు ఆచరిస్తారు. అక్కడ గజాలను శుద్ధి చేసి సాయంత్రానికి గోదావరి జలాలను తీసుకువస్తారు. ఆ పవిత్ర జలాలతో పూజారులు సదర్ల భీమన్న ఆలయం శుద్ధి చేసి నైవేద్యం సమర్పిస్తారు. నాయక్‌పోడ్ సంఘం సభ్యులు, పూ జారులు తమ కుటుంబాలతో రాత్రికి అక్కడే నిద్రిస్తారు. రెండవ రోజు ఉదయం పవిత్ర గోదావరి జలాలతో గాంధారి ఖిల్లాకు చేరుకొంటారు.

సాయంత్రం 108 కొత్త కడవలతో గోదావరి జలాలను తీసువెళ్లి కాల భైరవునికి, లక్ష్మీదేవర కు, మైసమ్మ దేవతకు అభిషేకం చేసి శుద్ధి చేస్తా రు. అర్ధరాత్రి దాటాక ఖిల్లా గుమ్మం వద్ద కొలువై ఉన్న మైసమ్మ దేవత ముందర పట్నాలు వేసి కొలుస్తారు. ఆ సమయంలో గుట్ట కింద సాం స్కృతిక కార్యక్రమాలు లక్ష్మీదేవర బృంద నృత్యా లు జరుగుతాయి. మూడవ రోజు తెల్లవారుజామున మైసమ్మ దేవతకు దున్నపోతును, మేకలను బలి ఇస్తారు. తెల్లవారాక భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఆరోజు వంటావార్పు చేసుకొని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. దీంతో మూడు రోజుల జాతర ముగుస్తుంది. అ వాంఛనీయ ఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో మెడికల్ క్యాంప్, అటవీ, ఫైర్ విభాగాల పర్యవేక్షణలో జాతర సాగనుంది.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles